ప్రతిపక్ష పార్టీలకు రఘురామకృష్ణరాజు మీద ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ?

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు 

పశ్చిమ గోదావరి జిల్లా:  ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీదు ఎందుకంత ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేలా వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తిని చ‌ట్ట‌ప్ర‌కారం అరెస్టు చేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శ‌నివారం తాడేప‌ల్లిగూడెంలో ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాద్ రాజు , గ్రంధీ శ్రీ‌నివాస్‌తో క‌లిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. 

ఎంపీ రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారు. కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. క‌రోనా సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదు. అసలు ప్రతిపక్ష పార్టీలకు రఘురామకృష్ణరాజు మీద ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ.

పశ్చిమగోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారు.  అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై నేను సైతం కేసు పెట్టడం జరిగింది.  ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణరాజుకు అవసరం లేదు. అలాంటివారికి గుణపాఠం అవసరం.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఫోటో తో రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలుపొందారు కానీ, తన ఫేమ్ తో గెలవలేదు. సంక్రాంతి సమయంలో కోడి పందాలపై కేసులు వేస్తూ ప్రచారం పొందే వ్యక్తి రఘురామకృష్ణరాజు ,  రఘురామకృష్ణరాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని మంత్రి శ్రీ‌రంగ‌నాథ‌రాజు స్ప‌ష్టం చేశారు. 

ప్ర‌భుత్వంపై అసంతృప్తి పెంచాల‌న్న‌దే ఆయ‌న ఉద్దేశం:  ఎమ్మెల్యే  ముదునూరి ప్రసాద్ రాజు

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై అసంతృప్తి పెంచాల‌న్న‌దే రఘురామ‌కృష్ణ రాజు ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు మండిప‌డ్డారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  ప్రభుత్వం ఇంతకాలం ఉపేక్షించింది. కొన్ని వర్గాలపైన రఘురామకృష్ణరాజు విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారు, తద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెంచాలన్నది ఆయన ప్రయత్నంగా ఉంది. 

ప్రతిరోజూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పథకం ప్రకారం, నిర్మాణాత్మకంగా కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసి, ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేయడానికి రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారు.

ఉద్దేశ పూర్వక చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చేలా, చెడ్డపేరు తీసుకువచ్చేలా రఘురామకృష్ణంరాజు యత్నిస్తున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే పలుమార్లు యత్నించారు.  కొన్ని మీడియా ఛానళ్ల సహకారంతో రఘురామకృష్ణంరాజు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ వర్గాలు,  సామాజిక వర్గాలు మధ్య ద్వేషాన్ని పెంచి శాంతిభద్రతల సమస్యను సృష్టించాలనే ఆయన ఉద్దేశం..

తగిన శాస్తి జరిగింది: వైయ‌స్ఆర్ సీపీ భీమవరం ఎమ్మెల్యే శ్రీ‌ గ్రంధి శ్రీనివాస్ 

 రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని వైయ‌స్ఆర్ సీపీ భీమవరం ఎమ్మెల్యే శ్రీ‌ గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు.  పిచ్చి కుక్కలా.. రోజు రచ్చబండలో మాట్లాడుతున్న వ్యక్తికి తగిన శాస్తి జరిగింది.  జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు క్షత్రియులు..  క్షత్రియ సామాజిక వర్గానికి అపకీర్తి తెచ్చిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు

కరోనా సమయంలో ప్రజల సమస్యలను కనీసం పట్టించుకోని బాధ్యత లేని వ్యక్తి ఎంపీ రఘురామకృష్ణరాజు.  చంద్ర బాబు డైరెక్షన్ లోనే రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి.  రఘురామకృష్ణ‌రాజును అరెస్టు చేయడం ఆలస్యమైన, ఇప్ప‌టికైనా సీఐడీ సరైన చర్య తీసుకుంది.  రఘురామకృష్ణరాజు కుట్ర వెనుక భాగస్వాములైన వారిని కూడా విచారణ చేసి అరెస్ట్ చేయాల‌ని వైయ‌స్ఆర్ సీపీ భీమవరం ఎమ్మెల్యే శ్రీ‌ గ్రంధి శ్రీనివాస్ కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top