జేసీ కుటుంబం అక్రమాలు, హత్యలు అందరికీ తెలుసు

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు

జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రి శంకర్‌ నారాయణ హెచ్చరిక

సచివాలయం: జేసీ దివాకర్‌రెడ్డి పూటకో రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్‌రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జేసీ దివాకర్‌రెడ్డి అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని చెప్పారు. అక్రమ మైనింగ్‌ విషయంలో కోర్టులే జేసీ దివాకర్‌రెడ్డికి అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు.
 

Back to Top