పుంగనూరు అల్లర్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు 

  మనుషులను చంపేసి సానుభూతి డ్రామా కోసం ప్రయత్నం

  పోలీసులపై దాడి జరిగితే పచ్చపత్రికలు ఒక్క వార్త రాయలేదు

 దీనిపై మాట్లాడాలన్నా ప్యాకేజీ కావాలా పవన్ కల్యాణ్..?

  దొడ్డిదారిన మంత్రివైన నీకు, రిషాంత్ రెడ్డికి పోలికా లోకేశ్..?

 చేతకాని వాడే హింసను ప్రేరేపిస్తాడు..

 23 సీట్లిచ్చి మూలన కూర్చోబెట్టినా వీళ్లకు బుద్దిరాలేదు. 

  చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది లాంటి వాడు. సంఘ విద్రోహశక్తి..

  ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కొనసాగించకూడదు: మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు

తాడేప‌ల్లి:  పుంగనూరు అల్లర్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు విమ‌ర్శించారు.   అంజూ యాదవ్ అనే సీఐ ఒక వీధి రౌడీ అల్లరి చేస్తే లెంపకాయ కొట్టారు. 
- అదేదో తీవ్రమైన నేరమైనట్లు, పోలీసులు ప్రజల హక్కులను హరించివేస్తున్నారు అని ప్రచారం చేశారు. 
- ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీ పేటీఎం బ్యాచ్ అంతా అల్లరి చేశారు. 
- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతి వెళ్లి ఎస్సీకి ఫిర్యాదు చేశారు. 
- మూడు రోజుల క్రితం చంద్రబాబు కర్త,కర్మ, క్రియగా వ్యవహరించి జరిగిన అమానుషంపై ఎందుకు వీళ్లు మాట్లాడటం లేదు..? 
- అంగళ్లులో ఎలా వాళ్ల మనుషులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. 
- అక్కడి పోలీసులు పాటించిన సంయమనానికి సెల్యూట్ చేయాలి. 
- ప్రాణాపాయం ఎవరికీ కలుగలేదు కానీ..చంద్రబాబు కుట్రలను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే మాస్ కిల్లింగ్స్ జరిగి ఉండేవి.
- 40 మంది పోలీసులు నెత్తురోడుతూ శాంతిభద్రతలను కాపాడారు. 
- ఈ వార్త కనీసం రామోజీరావు, రాధాక్రిష్ణ, టీవీ5 నాయుడులు ఒక్క చోటైనా ప్రచురించారా..? 
- ఎంత సేపు చంద్రబాబు దేవుడు, వీరుడు, శూరుడు అంటున్నారు. 
- చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందంటూ రాయడం తప్ప సిగ్గు లజ్జ వారికి లేకుండా పోయింది. 
- దీనికేనా మీరు మీడియా నడుపుతున్నది..? చంద్రబాబు కుట్ర చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. 
- కార్లలో గన్ లతో, కత్తులతో, బీరుబాటిళ్లతో దాడి చేయడం అందరం చూశాం. 
- పోలీసులు కాల్పులు జరిపించి మా మనుషులను ఈ ప్రభుత్వం చంపేస్తుందని సానుభూతి పొందాలని ప్లాన్ వేసుకుని వచ్చాడు. 
- జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉంది కదా..ఎందుకు రూట్ మారింది..
- అలాంటి చంద్రబాబు కుట్రను పోలీసులు చక్కగా తిప్పికొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. 
- ఆయన సుపుత్రుడు టీడీపీ కార్యకర్తల దెబ్బ చూశారు కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. 
- చంద్రబాబు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నాడు. తండ్రీ కొడుకుల నాటకాలు మానేయండి...
- ఇంత మంది పోలీసులుపై దాడి జరిగితే నీదీ ఒక రాజకీయ పార్టీనే కదా..స్పందించవద్దా..? 
- దీనిపై స్పందించాలన్నా ప్యాకేజీ కావాలా పవన్ కల్యాణ్..? 
- ఈ మాత్రం దానికి నీకు ఎందుకు నీకు రాజకీయ పార్టీలు..వారాహి డ్రామాలు. 
- చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కోసం పుష్కరాల్లో పదుల సంఖ్యలో ప్రజల్ని చంపేశాడు. 
- మొన్నటికి మొన్న ఇదేం ఖర్మ అనుకుంటూ ఎంత మందిని చంపాడో చూశాం. 
- ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయ్..రాష్ట్రం రావణ కాష్టం కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. 
- ప్రజలంతా ఇతని అధికార దాహాన్ని, రక్త దాహాన్ని గమనించండి. 

రిషాంత్ రెడ్డికి, నీకు పోలికేంటి లోకేశ్..?
- ఎర్రడైరీలో మొదటి పేరు రిషాంత్ రెడ్డి అని లోకేశ్ అంటాడు. 
- దొడ్డిదారిలో మంత్రివైన నీకు..ఐఐటీలో చదివి, మంచి ర్యాంకుతో ఐపీఎస్ అయిన అతనికి నీకు పోలిక ఎక్కడ..? 
- మీ నాన్న డబ్బులు పెట్టి చదివిస్తే నువ్వు స్టాన్ ఫోర్డ్ వెళ్లి చదివావు తప్ప నీ టాలెంట్ వల్ల కాదు. 
- నీ బాడీ లాంగ్వేజ్ కి నీ డైలాగ్ లకు అసలు ఏమైనా సంబంధం ఉందా..? 
- ముందు నువ్వు గెలుస్తావా లేదా అనేది చూసుకో. 
- లోకేశ్, చంద్రబాబులు ఇద్దరూ ఒళ్లు కొవ్వొక్కి వాడు వీడు అంటూ మాట్లాడుతున్నారు. 
- వీరిద్దరిపై హత్యాయత్నం కేసులు పెట్టాలి. 
- చేతకాని వాడే హింసను ప్రేరేపిస్తాడు...సానుభూతి డ్రామా ఆడతారు. 
- చంద్రబాబుకు, ఆయన పుత్రుడికి, దత్తపుత్రుడికి గెలవలేం అని అందర్నీ రెచ్చగొడుతున్నారు. 
- వీరికి ఎల్లో మీడియా వాళ్ల మనిషి కుర్చీలో లేడని ఇష్టారీతిన రాతలు రాస్తున్నారు. 
- 23 సీట్లిచ్చి మూలన కూర్చోబెడితే వారికి ఇంకా బుద్ధిరాలేదు. మరింత బలంగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉంది. 
- మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ప్రాజెక్టులతో సస్యశ్యామలం ఎందుకు చేయలేకపోయావ్..? 
- రాజశేఖరరెడ్డి అనే వ్యక్తే ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటి..? 
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నేనే కట్టాను అంటాడు..ఎక్కడుందో చూపించు..జీవో ఇస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనా..? 
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎక్కడ, ఎప్పుడు, ఎలా కట్టావ్...చూపించు. 
- చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది లాంటి వాడు. 
- సంఘ విద్రోహశక్తి...ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రజలకు మనవి. 

తాజా వీడియోలు

Back to Top