జేపీ నడ్డాకు మంత్రి రోజా కౌంటర్‌

ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా..?

విజయవాడ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రజలు ఎవరి వైపు ఉంటారో తొందరలోనే నడ్డాకు తెలుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేని గొప్ప పాలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకం ఎక్కడుందని జేపీ నడ్డాను ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top