లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..?

మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌

తాడేప‌ల్లి:  స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ విచారిస్తోంది. మ‌రోవైపు బాబు లాయర్లు కస్టడీని వ్యతిరేకిస్తూ వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నారా లోకేష్  ఢిల్లీలో దాక్కోవ‌డం ప‌ట్ల మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదిక‌గా టీడీపీ నేత‌ల తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు మంత్రి రోజా ట్వీట్ చేశారు.

దేశంలోనే అవినీతి అనకొండ అయిన నారా చంద్ర‌బాబు నాయుడికి తొలి కస్టడీ డే శుభాకాంక్షలు.  ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..? తండ్రి అడ్డంగా తినేసి జైలుకి వెళితే మా నాన్న ఎలా పోయిన పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేష్ ఆంధ్రా కి ఎప్పుడొస్తావ్..? తల్లి, భార్య  మీద మీ నాన్న భారం వదిలి పలాయనం చిత్తగించిన పులకేశ్ నీ జాడ ఎక్కడ..? మీ నాన్న అవినీతి పై బహిరంగ చర్చకు రమ్మన్నావ్.. నువ్వేమో ఆంధ్ర వదిలి పారిపోయావ్.. మీ మావ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్ధం.. కాదని నిరూపించే ధైర్యం ఉందా ..? లోకేష్.. ధైర్యం ఉంటే.. అసెంబ్లీ కి మిలో ఎవరు వస్తారో.. రండి.. ఇది మా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సవాల్..అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు.

అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో ఓ పోస్టు చేసింది. తండ్రి స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే.. రోడ్డు మీద ధర్నాలు చేయండని కార్యకర్తలను రెచ్చగొట్టి నారా లోకేష్ మాత్రం ఢిల్లీలోని 7 స్టార్ హోటల్స్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు! అంటూ ట్వీట్ చేసింది.
 

Back to Top