చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా?

మంత్రి ఆర్కే రోజా
 

తిరుప‌తి: 14 ఏళ్ళు అధికారంలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా? , రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా? అని మంత్రి ఆర్కే రోజా ప్ర‌శ్నించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రైతుల గురించి అనునిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం తిరుపతిలో రైతు భరోసా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు కాదా..? చంద్రబాబు పాలనలో రైతులు కష్టానికి విలువ లేదు..‌రైతుల చెమటకి ఖరీదు లేదు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎంతో మంది వేదికలపైకి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులను చూశాం. కానీ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం కమిట్మెంట్ తో రైతులకు ఆదుకోవాలని ముందుకు వచ్చి ఆదిశగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top