పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా?

కందుకూరు, గుంటూరు ఘటనలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

సీఎం వైయస్‌ జగన్‌ తక్కువ అప్పులతో ఎక్కువ సంక్షేమం చేశారు

పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి కలుగుతోంది

చంద్రబాబు తప్పుడు మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారు

చంద్రబాబు వల్ల అమాయకులు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా? 

కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్‌ ఎందుకు స్పందించలేదు

 పవన్‌.. నోటికి హెరిటేజ్‌ ప్లాస్టర్‌ వేసుకున్నాడా?

 ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు, లోకేష్, పవన్‌ ఎవరైనా సరే ఉపేక్షించం

 తాడేపల్లి: పేదవారి ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్క లేదని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.  40 ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40 మందిని చంపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుకల పేరుతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నార న్నారు. చంద్రబాబు వల్ల అమాయకులు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌..నోటికి హెరిటేజ్‌ ప్లాస్టర్‌ వేసుకున్నాడా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారు. పవన్‌ ప్యాకేజీకి తప్ప..పాలిటిక్స్‌కు పనికి రాడని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న గుంటూరులో ముగ్గురు ఆడవాళ్లు చనిపోతే ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. 

ఆశ పెట్టి పేద మహిళల్ని చంపారు..
గుంటూరులో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమంలో ముగ్గురు నిరుపేద మహిళలు మరణించడం, మరికొందరికి గాయాలవడం చాలా ఘోరమైన పరిణామంగా చూడాలి. ఏవేవో కానుకలంటూ ఊదరగొట్టే ప్రచారంతో మహిళల్ని నమ్మకంగా తీసుకెళ్లి.. అక్కడ వారికి ఎటువంటి కానుకలు ఇవ్వకుండా తోపులాటకు గురిచేసి మహిళాసోదరీమణుల ప్రాణాల్ని ఈ చంద్రబాబు నిలువునా తీసేశాడు. పండుగ రోజుల్లో మహిళలకు ఆశ చూపెట్టి.. అదే అవకాశంగా తీసుకుని వారి ప్రాణాలు తీయడం ముమ్మాటికీ చంద్రబాబు చేతులారా చేసిన ఘోరమైన నేరంగానే భావించాలి. ఈ ఘటనతో పాటు కందుకూరు ఘోరంపై కూడా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యల కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మేమంతా కోరుతాం..

బాబు సభలకు జనాలు రావడంలేదనే ఇదంతా..
గుంటూరులో కానుకల సభ పెట్టి, పోలీసుల వైఫల్యం అని మాట్లాడటం సిగ్గుచేటు. అక్కడ పోలీసులు సరిపడా ఉండబట్టే ప్రమాదతీవ్రత తగ్గింది, వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.  అక్కడ పోలీసులెవరూ లేకపోయుంటే.. ఇంకా ఎలాంటి ఘోరమైన పరిస్థితి జరిగి ఉండేదో మీడియాలో వచ్చిన విజువల్స్‌ను బట్టి మనమంతా అర్ధం చేసుకోవాలి. చంద్రబాబు తన సభలకు జనాలు రావడంలేదనే ఆందోళనతో మహిళలకు చీరలిస్తాం, సారెలిస్తామని తరలించుకునే పరిస్థితికి దిగజారాడు. ‘45 ఏళ్ల పొలిటికల్‌ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చక్రం తిప్పానని డబ్బా కొట్టుకునే చంద్రబాబూ.. నీ చక్రం ఎక్కడ తిరిగిందయ్యా..?’ ముప్పై, నలభై వేల మందికి చీరలిస్తామని ప్రచారం చేసుకున్నారు. పండగరోజుల్లో చీరలిస్తామంటే.. మహిళలు ఆశకొద్దీ అక్కడికి వెళ్లి ఉండొచ్చు. సరే, అక్కడకొచ్చిన వారికైనా పంపిణీ చేశాడా..? అని చూస్తే.. ఏదో తూతూమంత్రంగా కొంతమందికి మాత్రమే అందించి చంద్రబాబు వెళ్లిపోవడం.. ఆ తర్వాత ఆయన మనుషులు కూడా చీరలు, సరుకులు సరిపడా లేకపోవడంతో మహిళల్లో ఆందోళన కలిగింది. ఈ క్రమంలో అరాకొరా ఇచ్చే సరుకుల్నైనా అందుకోవాలనే తాపత్రయంలో తొక్కిసలాట జరగడం, మరణాలకు దారితీయడం జరిగింది. ఈ విధంగా మహిళల్ని నమ్మించి నిలువునా ముంచడమే కాకుండా వారి ప్రాణాలు తీసేవిధంగా చంద్రబాబు శవ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. ఖచ్చితంగా గుంటూరు, కందుకూరు మరణాలన్నింటికీ చంద్రబాబు బాధ్యుడు. 

పవన్‌కళ్యాణ్‌ పాలిటిక్స్‌కు పనికిరాడు
చంద్రబాబు తానా అంటే తందానా అంటూ.. నడిరోడ్ల మీద కార్లపై ఇష్టానుసారంగా ఊరేగుతూ,  యువతను రెచ్చగొట్టే పవన్‌కళ్యాణ్‌ కేవలం ప్యాకేజీకే తప్ప పాలిటిక్స్‌కు పనికిరాడు. ‘పనికిమాలిన విషయాలపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇప్పటం గోడలపై రాద్ధాంతం చేసిన పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు గుంటూరు, కందుకూరులో జరిగిన ఘోరమైన ఘటనల మీద ఎందుకు నోరు తెరవలేదు..? నీకు ప్యాకేజీ ఇచ్చిన నాయకులకు నష్టం కలుగుతుందనా..?’ . పవన్‌ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారో.. లేదంటే, హైదరాబాద్‌లో ఉన్నారో.. ప్రజల ప్రాణాలంటే పవన్‌కు లెక్కలేదు. మహిళలంటే ఆయనకు అస్సలు లెక్కలేదు. ఈ విషయాన్ని గుర్తించినందువల్లనే పవన్‌కళ్యాణ్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కులం గురించి అరిచినా.. చెప్పులు చూపించినా.. పవన్‌కు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేడు. ఆయనకు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.   
 
క్రమశిక్షణ లేని పార్టీ టీడీపీ..
మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తే.. ఎక్కడా చిన్న అవాంతరం జరగలేదు. అదేవిధంగా ఆయన 3648 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తే,  జగనన్న అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు యాత్రకు సంఘీభావం తెలిపేందుకు లక్షలాదిమంది తరలివచ్చారు. అప్పట్లో ఏదైనా చిన్న సంఘటన జరిగినట్లయినా మనం ఎక్కడా మీడియాలో చూడలేదు కదా.. అది మా వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణ. అది జగనన్న నాయకత్వ పటిమకు నిదర్శనం. అయితే, చంద్రబాబు తనపార్టీ కార్యకర్తల్ని కంట్రోలు చేయలేని నాయకుడు. టీడీపీలో ఎక్కడా క్రమశిక్షణ కనిపించదు. కేవలం చంద్రబాబుకు, ఆయన పార్టీ కేడర్‌కు పబ్లిసిటీ పిచ్చి తప్ప మరొకటి కనిపించడంలేదు. బాబుకు ఈ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి అభిమానం, ప్రేమ లేదు. ఆయనకు ఎలాంటి కానుకలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కూడా లేదు. తన సభలకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారని డ్రోన్ షాట్ల ద్వారా  చూపించుకోవాలనే తాపత్రయంతో, అడుగుపెట్టిన ప్రతీ ఊరిలో ఈ విధంగా ఘోరమైన ప్రమాద వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 
ప్రజలనే వాళ్లు మంచి చేస్తే అభిమానంతో వస్తారు గానీ, మోసం చేసిన నాయకుడి సభలకు జనమెందుకు వస్తారు..? అందుకే, ఈరోజు టీడీపీ ఇలా రకరకాల తాయిలాలు ఇస్తామని జనాల్ని తరలించే ప్రయత్నాలకు పాల్పడటం.. సభలకు వెళ్లిన వారి ప్రాణాల్ని తీయడం జరుగుతుంది. ‘సభలకు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలిస్తుంటే.. మా సభల ఆదరణను చూసి ప్రభుత్వం భయపడుతుంది..’ అని బాబు అనడం హాస్యాస్పదంగా ఉంది. 

లోకేష్‌ పాదయాత్ర అంటేనే ఘోరాలు, చావులు!
చంద్రబాబు కొడుకు లోకేష్‌ పాదయాత్ర అనగానే... రాష్ట్రంలో ఎన్నెన్ని ఘోరాలు, చావులు చూస్తున్నామో అర్ధమవుతుంది కదా.. ఈ పప్పు లోకేష్‌ పాదం ప్రభావంతో ప్రజలు ముందుగానే తీవ్రమైన భయాందోళనలు చెందుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు ప్రతీ కుటుంబానికి జగనన్న నేతృత్వంలో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా అందుతుంటే.. లోకేష్‌ ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తాడు..? అని అడుగుతున్నాను. గతంలో ఇదే చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం అని పెట్టారు. దానికి ఆపార్టీ నాయకులే హాజరుకాలేదంటే.. చంద్రబాబు నాయకత్వానికి ఉన్న విలువేంటో అర్ధమౌతుంది కదా.. ఇక,  పెయిడ్‌ ఆర్టిస్టులతో అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర అనగానే.. రైతులకు ఐడీ కార్డులు కచ్చితంగా ఉండాల్సిందే అని హైకోర్టు చెప్పడంతో, ఫేక్ రైతులు తోకముడిచిన సంగతి అందరికీ తెలిసిందే. బాబు పర్యటనలు, ప్రసంగాలంటే.. ఆ పార్టీ నాయకులే ‘ఇదేం ఖర్మరా బాబు’ అని తలబాదుకుంటున్నారు. కరువుకు ప్యాంటు,షర్టు వేస్తే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. లోకేష్‌ పాదయాత్ర ప్రకటన చేస్తేనే .. ఇంత పెద్ద ఎత్తున మరణాలు జరిగితే.. ఈ దెబ్బతో లోకేష్‌ పాదమహిమ తెలిసి జనం ఊళ్లల్లోకి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. కనుక, ఇప్పటికైనా బాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌ పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు చేస్తే..  పవన్‌కళ్యాణ్‌ అయినా.. చంద్రబాబైనా ప్రజాగ్రహం ఎదుర్కొనకతప్పదు. 

కేంద్రం బుద్ధిచెప్పినా.. తీరుమార్చుకోని బాబు
గొప్ప పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న జగనన్న నాయకత్వంపై చంద్రబాబు, అతని దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లు కలిసి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ‘అప్పులు చేస్తున్నారు.. పేదలకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారు..’ అని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి మొన్ననే చెప్పుతో కొట్టినట్టు కేంద్రం బుద్ధిచెప్పింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు ఉన్న అప్పుల్ని.. ఇప్పుడున్న అప్పులతో పోల్చిచూస్తే.. కేవలం రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే మా ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్లు తేలింది. ఇదిలాఉంటే, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మాత్రం లేనిపోని విమర్శలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారనే విషయం జనాలకు కూడా అర్ధమైంది. 

2024లో అధికారం వైఎస్‌ఆర్‌సీపీదే..
కరోనా సంక్షోభంలో కూడా ఈ రాష్ట్రాన్ని సంక్షేమాంధ్రప్రదేశ్ గా నడిపించిన జగనన్న నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రతీ కుటుంబానికి అండగా నిలబడి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన సమర్ధుడైన నాయకుడు శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి. గతంతో పోల్చుకుంటే  మా ప్రభుత్వం అప్పులు చేసింది తక్కువే . సంక్షేమాన్ని ఎక్కువ చేశాం. అమ్మవడి, చేయూత, నాడు– నేడు పేరిట పాఠశాలల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్నిరంగాల్లో కూడా రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందనేది ఈ రోజు ప్రజలు అందరూ చూస్తున్నారు. జగనన్న అందించిన సుపరిపానను అందరూ హర్షిస్తున్నారు. అదిచూసి తట్టుకోలేని చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌ విషప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని విష ప్రచారాలకు పాల్పడినా.. పొత్తులతో ఎంతమంది కలిసి గుంపుగా వచ్చినప్పటికీ.. మా నాయకుడు సింగిల్‌గా 2024లో అనూహ్యమైన మెజార్టీ స్థానాలతో ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయం. 

Back to Top