దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్ర‌వాది చంద్ర‌బాబు

బాబు క‌డిగిన ముత్యం కాదు.. అవినీతి అనకొండ, క‌రప్ష‌న్ కింగ్‌..

అమరావతిలో ఈ గజదొంగ ప్రతి గజాన్ని దోచేశాడు

స్కిల్ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుల పాత్ర కూడా ఉంది

"జైల్‌ చౌదరి", "అవినీతి సైకో" అని పిలవాలా..?

బాబుకు ప్రాణహాని కాదు.. బాబు వల్లే ఎవరికైనా ప్రాణహాని ఉంటుంది

దత్తపుత్రుడికి పొత్తు కోసం బీజేపీ.. ప్యాకేజీ కోసం టీడీపీ

రాజకీయ కక్ష సాధింపులంటే వైయ‌స్ జగన్‌పై మీరు చేసినవి..

అటువంటి చీప్ ట్రిక్స్ సీఎం వైయ‌స్ జగన్ చేయరు

ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా 

తిరుప‌తి: చంద్రబాబు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది.. కరప్షన్‌ కింగ్‌.. బోగస్‌ కంపెనీలతో దోచుకున్న అవినీతి అనకొండ.. బోగస్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌.. అని ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతిలో కూరుకుపోయిన ముత్యం,  అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే స్కీమ్‌లు కాదు.. స్కామ్‌లే గుర్తుకు వస్తాయ‌న్నారు. స్కిల్‌ స్కామ్‌ను చాలా స్కిల్డ్‌ క్రిమినల్‌గా దోచుకున్నాడన్నారు. స్కామ్‌లు చేయ‌డం, వ్యవస్థలను మేనేజ్‌ చేసుకోవడం, స్టేలు తెచ్చుకోవడం వల్ల తాను చేసిన అవినీతి కేసుల్లో ఇన్నాళ్లూ చంద్ర‌బాబు తప్పించుకుంటూనే వస్తున్నాడని, కానీ ఈరోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో అది కుదరలేదన్నారు. ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేసి సాక్షాధారాల‌తో స‌హా దొరికిపోయిన త‌రువాత రాజ‌కీయ క‌క్ష సాధింపు అంటూ ఎల్లో మీడియా, టీడీపీ నేత‌లు, ద‌త్త‌, ఉత్త పుత్రులు ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తిరుప‌తిలో మంత్రి ఆర్కే రోజా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..
సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబునాయుడును అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపడాన్ని రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా స్వాగతిస్తున్నారు. కోర్టు తీర్పు న్యాయ దేవత- న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా చేసింది. స్కిల్ అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును రిమాండ్‌కు పంపిన న్యాయదేవత- ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా భావితరాలకు ఒక గొప్ప సందేశాన్ని అందించింది. చంద్రబాబును (ఖైదీ నంబర్‌ 7691) జైలుకు పంపి పోలీసు, న్యాయ వ్యవస్థలు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య విజయం.. ఇది రాజ్యాంగం సాధించిన విజయం. 

రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద కుంభకోణం స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాం. దీనిలో రూ.241 కోట్లు కొల్లగొట్టి పక్కాగా దొరికి అరెస్టయిన కేసు ఇది. చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైలుకు పంపితే.. ఎంతోకాలంగా తప్పించుకుతిరుగుతున్న దొంగ ఎట్టకేలకు దొరికాడు అని ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ..టీడీపీ వారు, దత్తపుత్రుడు, ఉత్త పుత్రుడు, అనుబంధ సంస్థలు, పచ్చ చానళ్లు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. నేను నిప్పు.. నా అంత నిజాయితీపరుడు లేడంటూ తన పచ్చ మీడియాతో ఇంతకాలం ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు.. ప్రజల్ని ఏవిధంగా మభ్యపెట్టడానికి ప్రయత్నించాడో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు- ఎప్పుడూ తాను టెక్నికల్ గా దొరకను.. తనను ఎవరూ ఏమీ చేయ‌లేరు..టచ్‌ చేయలేరు అని చెప్తుంటాడు. రాత్రుల్లో వారి వీరి కాళ్లు పట్టుకోవడం, వ్యవస్థలను మేనేజ్‌ చేసుకోవడం, స్టేలు తెచ్చుకోవడం వల్ల తాను చేసిన అవినీతి కేసుల్లో తప్పించుకుంటూనే వస్తున్నాడు. కానీ ఈ రోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో అది కుదరలేదు. 

స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే పాత్రధారి, సూత్రధారి. అత్యధికంగా డబ్బులు అందింది కూడా చంద్రబాబుకే. అందుకే ఆయన సాక్షాధారాలతో దొరికిపోయాడు. చంద్రబాబు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది. అతి పెద్ద కరప్షన్‌ కింగ్‌.. బోగస్‌ కంపెనీలతో దోచుకున్న అవినీతి అనకొండ. బోగస్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఈ కుంభకోణంలో చీఫ్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌ సెక్రటరీలపై వత్తిడి తీసుకువచ్చి బోగస్‌ కంపెనీలకు డబ్బులు విడుదల చేయించి తన అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్న తీరు సాధ్యాధారాలతో సహా బట్టబయలైంది. సాక్షాధారాలతో దొరికాడు కాబట్టే కోర్టు రిమాండ్‌ విధించి జైలుకు పంపించింది. నేను టీడీపీ వారిని, దత్త పుత్రుడు, ఉత్త పుత్రుడిని ఒకటే అడుగుతున్నా. చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతిలో కూరుకుపోయిన ముత్యం. 
చంద్రబాబు అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం.

మేం కక్ష సాధించాలనుకుంటే 2021లోనే కేసు నమోదు అయ్యింది. మేం అప్పుడే కోవిడ్‌ టైంలో అరెస్ట్‌ చేసి ఉండొచ్చు. లేదా వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అరెస్ట్‌ చేసి ఉండేవాళ్లం. కానీ సీఎం వైయ‌స్‌ జగన్‌కి అలాంటి ఆశ, ఆలోచన లేదు. మనం పార్టీ పెట్టింది ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అని సీఎం వైయ‌స్ జగన్‌ నమ్ముతారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి  కన్నకలలను సాకారం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరునవ్వు చూడాలన్నది ముఖ్య‌మంత్రి సంకల్పం. అందుకే వీళ్లందరూ కలిసి, వైయ‌స్‌ జగన్‌పై కక్ష సాధించి, ఆయన్ను రాజకీయంగా మొగ్గలోనే తుంచేయాలి అనుకున్నా అన్నింటినీ ఎదుర్కొని తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేసినా సమర్ధవంతంగా పరిపాలిస్తూ లాభాల్లోకి తీసుకొచ్చి, తానిచ్చిన వాగ్ధానాలను 99 శాతం పూర్తి చేసిన ఏకైక మనసున్న సంక్షేమ సామ్రాట్ వైయ‌స్ జ‌గ‌న్‌. రాజకీయ కక్షసాధింపులు చేయాలనే చీప్ అలవాట్లు వైయ‌స్ జగన్‌కి లేవు. 

కక్షసాధింపు అంటే సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని తెల్లపేపర్‌పై సంతకం పెట్టకుండా ఫిర్యాదు ఇచ్చి, వైయ‌స్‌ జగన్‌ని 16 నెలలు జైళ్లో పెట్టించడం కక్షసాధింపు అంటే. అలా ఈ కేసులో ఎక్కడైనా జరిగిందా..? ఈ కేసులో సీఐడీకి విచారణచేయడానికి స్వేచ్ఛనిచ్చాం. వాళ్లు సాక్షాధారాలతో అరెస్ట్‌ చేశారు..ఇందులో కక్షసాధింపు ఎక్కడుంది? నిన్న సినిమాలో హీరోలా చంద్రబాబు తన కేసులో తానే వాదించుకున్నాడట. గంట సేపు జనాలకు చెప్పే సోదే చెప్పాడు తప్ప తాను తప్పు చేయలేదని, స్కిల్‌ లో స్కాం లేదని మాత్రం చెప్పలేదు. పోనీ ఈ రూ.241 కోట్ల కుంభకోణం జరగలేదని మీరు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చిన సిద్ధార్థ లూథ్రా అనే వ్యక్తి ఏమైనా చెప్పాడా..? గవర్నర్‌కి చెప్పలేదు..మాకు ముందే నోటీసు ఇవ్వలేదు..నా పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదు అని కుంటి సాకులు చెప్పారు. మళ్లీ బయటకు వచ్చి నేను నిప్పు అని చెప్పుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ కుంభకోణం జరగలేదని కానీ, దానితో మాకు సంబంధం లేదని మాత్రం చంద్రబాబు, ఆయన లాయర్‌ చెప్పారా..? అలా చెప్పే ధైర్యం వారికుందా..? 

ఎన్టీఆర్‌కి అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకుని, ఆయనపై చెప్పులేసి ఆయన చావుకు కారణమయ్యారే అదీ కక్షసాధింపు. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్‌ చేయించారే దాన్ని కక్షసాధింపు అంటారు. ముద్రగడ భార్యను ఆపరేషన్‌ చేయించుకున్నా విసిరి పోలీసుల వ్యాన్‌లో వేసి, ఆయన కోడల్ని అమ్మనాబూతులు తిట్టారే దాన్ని కక్షసాధింపు అంటారు. ముద్రగడ కుమారుడిని పోలీసులతో ఎలా కొట్టించారో దాన్ని కక్షసాధింపు అంటారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్లో ప్రశ్నించినందుకు నన్ను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారే అది కక్షసాధింపు. మహిళా పార్లమెంట్‌కు పిలిచి నన్ను కిడ్నాప్‌ చేసి, చంపేయాలని చూశారే అది కక్షసాధింపు. ఈ రోజు సాక్షాధారాలతో దొరికిన గజదొంగను అరెస్ట్‌ చేస్తే దానికి కక్షసాధింపు అనే రంగుపూసి సింపతీ పొందాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ప్రజలంతా మీ డ్రామాలు గమనిస్తురు, మీకు ఎక్కడా సింపతీ లేదు- రాదు. 14 ఏళ్లు ఇలాంటి అవినీతి అనకొండ, గజదొంగనా మేం గెలిపించింది అని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కుప్పం ప్రజలు బాధపడుతున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో స్కాం జరిగిందని కేంద్రం ఆధీనంలో ఉన్న జీఎస్టీ అదికారులు లేఖ రాశారా లేదా..? ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2018లో ఈ కుంభకోణంలో ఏసీబీ విచారణ ప్రారంభించిందా లేదా..? దాన్ని చంద్రబాబు అడ్డుకున్నది నిజమా కాదా..? ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ విచారణ చేపట్టిందా లేదా..? ఈడీ నలుగురిని అరెస్ట్‌ చేసిందా లేదా? ఈడీ విచారణలో భాగంగా రూ.31 కోట్ల డిజైన్‌టెక్‌ సంస్థ ఆస్తులను అటాచ్‌ చేసిందా లేదా? అప్పట్లో చీఫ్‌ సెక్రటరీగా చేసిన కృష్ణారావు, ఫైనాన్స్‌ సెక్రటరీ రమేష్‌లపై వత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించింది నిజమా కాదా? ఈ కుంభకోణంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేశ్‌ స్నేహితుడు కిలారు రాజేశ్‌కి ముడుపులు అందింది నిజమా కాదా? దీనిలో పేర్కొన్న సీమెన్స్‌ సంస్థ ఈ స్కాంకు, జీవోలకు మాకు సంబంధం లేదని కోర్టులో చెప్పింది నిజమా..కాదా..? సాక్షాత్తు ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చంద్రబాబుకు ఎలా ముడుపులు అందాయో నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా..? ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా అబద్దమా..?, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దోచేసి పక్కా ఆధారాలతో దొరికితే అక్రమ కేసు అని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం..? 

రాష్ట్ర ప్రజలు ఈ స్కాం గురించి, చంద్రబాబు గురించి బాగా అర్ధం చేసుకున్నారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసి, వ్యవస్థలను మేనేజ్‌ చేసే, తన పచ్చ మీడియాతో ఎవర్నైనా ఏమైనా చేయగలను అని విర్రవీగే చంద్రబాబును అరెస్ట్‌ చేయాలంటే పక్కా సాక్షాధారాలు లేకుండా చేయగలరా? ఇదొక్కటే కాదు..ఇంకా ఫైబర్‌ గ్రిడ్‌ ఉంది..పట్టిసీమ, పోలవరం, అమరావతి భూములు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. ఇలా బాబు అవినీతి, అక్రమాలు చాలానే  ఉన్నాయి. వాటన్నిటిలో సాక్షాధారాలు దొరికిన వెంటనే మళ్లీ మళ్లీ అరెస్ట్‌ చేస్తూనే ఉంటారు. ఇది ఆంతం కాదు...ఆరంభం మాత్రమే. ఈ కుంభకోణంలో రెండున్నరేళ్లుగా విచారణ చేసిన తర్వాత సాక్షాత్తు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు రూ.241 కోట్లు దోచుకున్నారని ఆధారాలు దొరికాయి. ఈ కేసులో పాత్రధారులైన లోకేశ్, అచ్చెన్నాయుడులను కూడా అరెస్టు చేసి, విచారించాలి. 

ఇంత జరిగినా కూడా టీడీపీ నాయకులు, సోషల్‌ మీడియా, దత్తపుత్రుడి భాష మాత్రం మారలేదు. వైయ‌స్ జగన్‌ని అరెస్ట్‌ చేసినప్పుడు పచ్చ పత్రికలు ఏం రాశాయి.. పచ్చ చానళ్లు ఏం చర్చలు పెట్టాయి అనేది ఈ 12 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు వాళ్లు రాస్తున్నది చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. 12 ఏళ్లుగా మీరు వైయ‌స్‌ జగన్‌ని జైలురెడ్డి అని పిలిచారే.. ఇప్పుడు మేం జైల్‌ చౌదరి అని పిలవాలా..? అప్పుడు చంచల్‌ గూడా జైల్‌ అన్నారు కదా.. ఇప్పుడు రాజమండ్రి జైల్‌ అని మేం పిలవాలా? ఎప్పుడూ సైకో సైకో అంటున్నారే.. మేం అవినీతి సైకో చంద్రబాబు అనాలా? దత్తపుత్రుడైనా, ఉత్తపుత్రుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నా. 

తప్పు చేసిన మీకే అంత ఉంటే, తప్పుచేయని నాయకుడి వెంట ఉన్న మాకెంత ధైర్యం ఉండాలి.? మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడు. మీరు చేసే నీతిమాలిన రాజకీయాలను కూడా ఆయన ఎదుర్కొంటున్నాడు. మీలా ఏడుస్తూ కక్షసాధింపులంటూ డ్రామాలు ఆడలేదు.. రోడ్లపై కింద పడి దొర్లలేదు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ వాళ్లకి చాలెంజ్‌ చేస్తున్నా..మీరు తుప్పు కాదు...నిప్పు అనుకుంటే ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వండి. మీ చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు సీబీఐ, ఈడీ విచారణకైనా తాను సిద్ధం.. స్కిల్‌ స్కాంలో తాను తప్పు చేయలేదని ఒక లేఖ ఇవ్వండి. వైయ‌స్ జగన్‌ని ఒప్పించి క్యాబినెట్‌లో దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపి మీ మీద సీబీఐ, ఈడీ విచారణ చేయిస్తాం. 

తప్పు చేసి సాక్షాధారాలతో దొరికిపోతే టీడీపీ వారు బంద్‌ పిలుపునివ్వడం ఏమిటో? బందా.. మీ బొందా.. అని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాధారాలతో దొరికిపోయిన వాడికి బందేంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయినప్పుడు, 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చినప్పుడు బంద్‌కు పిలుపునివ్వాల్సింది. దొంగలా వచ్చి కరకట్ట కొంపలో కూర్చున్నాడో.. ఆనాడు మీరు ధర్నాలు, బంద్‌లు చేయాల్సింది. చంద్రబాబు ప్రజల డబ్బు దోచేసి, తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం చేస్తే మీరు బంద్‌కు పిలుపునిస్తారా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మంచి స్కీమ్‌ అయినా తీసుకొచ్చాడా? మ‌హానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పేరు చెబితే 9 గంటల ఉచిత విద్యుత్, 108, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్, అరోగ్యశ్రీ గుర్తుకు వస్తాయి. 

ఎన్టీఆర్‌ పేరు చెబితే రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం గుర్తుకు వస్తాయి. వైయ‌స్ జగన్‌ పేరు చెబితే వందకు పైగా స్కీములు గుర్తుకు వస్తాయి. అమ్మ ఒడి నుంచి అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. చంద్రబాబు పేరు చెబితే స్కీమ్‌లు కాదు.. స్కామ్‌లే గుర్తుకు వస్తాయి. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ను చాలా స్కిల్డ్‌ క్రిమినల్‌గా దోచుకున్నాడు. అమరావతిలో ఈ గజదొంగ ప్రతి గజాన్ని ఎలా దోచేశాడో అందరూ చూస్తున్నారు. అసైన్డ్‌ భూములను తన బినామీ పేర్లతో ఎలా దోచుకున్నాడో అసెంబ్లీ సాక్షిగా మేం చెప్పాం. పోలవరం నుంచి పట్టిసీమ వరకూ అంచనాలు పెంచేసి ఎలా దోచుకున్నారో అందరూ చూశారు. అవన్నీ త్వరలోనే ఆధారాలతో బయటకు వస్తాయి..మీరు మళ్లీ మళ్లీ జైలుకు వెళ్తారు. 

అవినీతిలో అరెస్ట్‌ అయిన ఒక వెధవ కోసం నేను సపోర్ట్‌ చేస్తున్నానని ఒక దరిద్రుడు చెప్తున్నాడు. జనసేన పార్టీ పెట్టి..దాన్ని చంద్రసేనగా మార్చి ప్యాకేజీ కోసం చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌ అనే దరిద్రుడు. బంద్‌కు పవన్‌ కల్యాణ్‌ మద్దతు పలుకుతున్నాడంటే దాని అర్ధం పొత్తు కోసం బీజేపీ కావాలి..ప్యాకేజీ కోసం టీడీపీ కావాలి. ఇదీ అతని స్కీమ్. పవర్‌ స్టార్‌ కాదు..ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అని మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్నాడు. 

2018లో చంద్రబాబు, లోకేశ్‌లంత అవినీతి పరులు లేరు..వారిని తరిమి తరిమి కొట్టండి అన్న ఇదే పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు వారికి ఊడిగం చేస్తున్నాడు. ఈ రోజు అదే అవినీతిలో చంద్రబాబు దొరికిపోతే ఆయనకు నేను మద్దతిస్తాను..లోకేశ్‌తో కలిసి పోరాడతాను అనడం కంటే సిగ్గు చేటు మరొకటి లేదు. ఇన్ని రోజులు చంద్రబాబుకు ఊడిగం చేశాడు..ఇక లోకేశ్‌కు కూడా ఊడిగం చేస్తాను అంటే జనసైనికులు రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని ఎటుపోవాలో అర్ధం కాక ఎటో చూస్తున్నారు. తన తల్లిని రూ.10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించి...పచ్చ చానళ్లలో చర్చలు పెట్టించారని ఫిల్మ్‌ చాంబర్లో రంకెలేసింది మర్చిపోయావా..? నీ తల్లిని తిట్టినా పర్లేదు..కానీ ప్యాకేజీ ముఖ్యం అంటున్న నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. చంద్రబాబును అరెస్ట్‌ చేయగానే పరిగెత్తుకుంటే వస్తే..శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అపితే ..ఏపీలోకి రావాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలా అని అడిగావు కదా..? ఆ రోజు ముద్రగడను హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్‌ చిరంజీవి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి వస్తే నీ పార్ట్‌నర్‌ చంద్రబాబు అరెస్ట్‌ చేశారు. ఆరోజు ఏపీకి  రావాలంటే పాస్‌పోర్ట్‌ కావాలా..వీసా కావాలా అని అడగలేదేం..? ఆ రోజు మీ అన్నను అరెస్ట్‌ చేసినప్పుడు కిందపడి దొర్లలేదేం..? ఈ రోజు దొంగలా ఆధారాలతో దొరికిన చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే కింద పడి దొర్లుతున్నావ్‌..? నీ క్యారెక్టర్‌ ఏంటి..? నువ్వేంటి..? నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు..చంద్రబాబు, లోకేశ్‌లకు ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకు అర్ధమైంది. 

వైయ‌స్ జగన్‌ తన బిడ్డల్ని చూసుకోడానికి లండన్‌ వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోడానికి వెళ్లాడంటావా..? నీకు చాలెంజ్‌ చేస్తున్నా.. కేంద్రంలో ఎవరికో చెప్పి ఆడిస్తాను అన్నావుగా..ఏ విచారణ అయినా వేయించండి. ప్రూవ్‌ చేయండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే కూడా రాజకీయం చేస్తావా? సిగ్గులేదు నీకు? బాబు షెల్‌ కంపెనీల్లో నీకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లుంది..నీకు కూడా సూట్‌ కేస్‌ కంపెనీ ఉన్నట్లుంది..? అందుకే బాబు సొంత కొడుకుకు లేని బాధ నీకు వచ్చింది. కిందపడి దొర్లి డ్రామాలు ఆడుతున్నావు. అన్నీ బయటకు వస్తాయి. సాక్షాధారాలు దొరకనివ్వండి..ఒక్కడ్నీ వదిలిపెట్టేది లేదు. అవినీతి చేసిన ఎవడినైనా అరెస్ట్‌ చేస్తాం. సామాన్యుడికి, చంద్రబాబు, ఆయన్ను పుట్టించిన ఖర్జూరనాయుడికైనా ఒకటే చట్టం. 

చంద్రబాబుకు ప్రాణహాని ఏంటి...? ఆయనే ఎవర్నన్నా చంపేస్తాడు తప్ప ఆయనకు ప్రాణహాని ఎలా ఉంటుంది..? దేవుడిగా కొలిచే ఎన్టీఆర్‌నే జనాల్లో పలుచన చేసి, పార్టీ లాక్కొని, వెన్నుపోటు పొడిచి చెప్పులేసి కూడా చంద్రబాబు దేవుడు అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఈ రోజు ఎన్టీఆర్‌ అభిమానులంతా ఆనందంతో ఉన్నారు. పొలిటికల్‌గా ఎంత మందిని పైకి పంపించాడు..ఎంత మందిని జైలుకు పంపాడో అందరికీ తెలుసు. ఎంత మంది క్యారెక్టర్‌ మీద నిందలు వేసి వారిని రాజకీయాల్లోంచి బయటకు వెళ్లేలా చేశాడో అందరూ చూశారు. పాపి చిరాయువు..తాను చేసిన పాపాలకు, తప్పులకు అనుభవించడానికే అలిపిరిలో బతికాడు. ఆయన ఎన్టీఆర్‌తో పాటు ఎవరికెవరికి ఏం చేశాడో జైళ్లో కూర్చుని తలుచుకుని పశ్చాత్తాప పడే రోజులు ఇవి. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ ని ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. కష్టపడి పనిచేస్తే తన కొడుకు కోసం అతన్ని పక్కకు పెట్టారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి తరిమేసి, వాళ్ల నాన్నకు చివరి దశలో కూడా పదవులు ఇవ్వకుండా అవమానించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు కూడా ఆడనివ్వకుండా కక్షసాధింపులు చేసి, ఇప్పుడు అతను రావడం లేదంటున్నారంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. వారికి అవసరం ఉన్నప్పుడు వచ్చి  మీరిచ్చిన స్క్రిప్ట్‌ పవన్‌ కల్యాణ్‌లా చదివేయాలి.. మళ్లీ సిగ్గు లేకుండా వెళ్లిపోవాలి. లేకపోతే మంచోడు కాదు...మద్దతు పలకడం లేదు అని మాట్లాడటం సిగ్గు చేటు. 

Back to Top