గొప్ప మార్పులు వైయ‌స్ఆర్‌సీపీతోనే సాధ్యం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ  మంత్రి  ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

తోటపాలెం:  వ్య‌వ‌స్థ‌లో గొప్ప మార్పులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ  మంత్రి  ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు.  ప్ర‌జాభీష్టానుసారం అభివృద్ధి ప‌నులు చేపడుతున్నామ‌ని తెలిపారు. తోటపాలెంలో రూ.40 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించిన సచివాలయం భవనాన్ని, రూ.21.80 లక్షల అంచనా విలువతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రారంభించారు. అలాగే పొన్నాడ ఆర్&బి రోడ్డు నుంచి బొంతల కోడూరు మీదుగా పాతదిబ్బలపాలెం వరకు రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 7.7 కిలోమీట‌ర్ల సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. 

అనంత‌రం బొంతలకోడూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేసిన రోజునే మన వారి మన్ననలు పొందుతాం. రోడ్డు నిర్మాణంలో శ్ర‌మించిన ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను అభినందిస్తున్నాను..ప్రభుత్వం పాలన సుమారు మూడున్న‌రేళ్లు అవుతోంది. ఇదే విషయమై గడప గడపకూ వచ్చి మీ  అభిప్రాయం సేకరిస్తున్నాం.  పూర్వం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఉండే పేద‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తే అవి స‌రిగా సంబంధిత అర్హుల‌కు అందేవి కావు. కానీ ఈనాడు ఆ అవ్య‌వ‌స్థ అన్న‌ది తొల‌గిపోయింది. నేరుగా డీబీటి ద్వారా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండ‌డం తో స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. గత ప్రభుత్వంలో జన్మ భూమి కార్యకర్తలు ఉన్నారు. వారంతా పసుపు చొక్కా వేస్తే కానీ పథకా లు ఇచ్చే వారు కారు. వారికి దండం పెట్టాలి. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. తేడా గ‌మ‌నించాలి మీరు. మీ ఆత్మాభిమానం పెంచే ప్రభు త్వం వచ్చింది కనుకనే..ఈ మార్పు చోటుచేసుకున్నాయ‌న్న విష‌యం ప్రజలు గమనించాలి.. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ లేదు. 

చేసేదేం లేక ప్రతిపక్ష నాయ‌కులు.. బాదుడో..బాదుడు అంటూ మీ ముందుకు వస్తున్నారు. పెట్రోల్,డీజల్ ధరలు పెరిగాయి అని ప‌దే ప‌దే అంటున్నారు.. ఒకసారి దేశం మొత్తం మీద కంపేర్ చేసి చూడాలి, ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వం నిర్థార‌ణ చేస్తాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో ఒకే విధంగా ధరలు ఉంటాయి. ఇది గమనించాలి. విప‌క్ష నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. 

ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి అంటూ..తిరుగుతున్నారు టీడీపీ వాళ్ళు..పిల్లలను బాగా చదివించడం ఖర్మ అవుతుందా ? బ్రోకర్ వ్యవస్థ లేకుండా చేయడం ఖ‌ర్మ అవుతుందా ? ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ఖ‌ర్మ అవుతుందా ? వీటిపై విప‌క్షాలు స‌మాధానాలు చెప్పాలి.

ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థులకు ట్యాబ్స్ పంచాం. అంటే ఆ కుర్రాడు మ‌న‌కు ఓటేస్తాడా ? ఎందుకు ఇచ్చారు  ఓ ధ‌నవంతుడితో స‌మానంగా ఓ పేద‌వాడు కూడా చ‌దువుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ప‌ద్ధ‌తిని అమ‌లు చేస్తున్నారు. బీద‌రికం అన్న‌ది త‌న ఎదుగుద‌ల‌కు అడ్డంకి కాకుండా ఉండాల‌న్న‌ది ఓ ల‌క్ష్యం. ఇది ఎంత మందికి అర్థం అవుతుంది. దీనిని మ‌నం అంద‌రికీ అర్థం అయ్యేలా చెప్పాలి. ఈ స‌మాజంలో నెల‌కొన్న అస‌మానత‌లు తొల‌గిపోయేందుకు మార్గం ఏంటి ? విద్య ఒక్క‌టే ..ఈ అస‌మాన‌త‌లు త‌గ్గించ‌గ‌లిగేది ఒక్క విద్యే .. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి ఈ ప్ర‌భుత్వ సాయంతో సామాజిక ఉన్న‌తి పొంద‌గ‌లిగితే ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌గ‌లిగితే అత‌డే ఆ స‌మూహాన్నీ లేదా ఈ స‌మాజాన్ని ముందుకు తీసుకువెళ్ల‌గ‌ల‌డు అన్న దృక్ప‌థంతో వైయ‌స్ జ‌గ‌న్ ప‌నిచేస్తున్నారు. 
ఇందులో భాగంగానే ఆధునిక సాంకేతిక‌త‌ను పేద విద్యార్థుల‌కు చేరువ చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీల‌తో స‌మన్వ‌యం అయి వారికి నాణ్య‌మ‌యిన విద్యా విధానం అందేవిధంగా, ధ‌న‌వంతుల  బిడ్డ‌ల‌కు మాదిరిగానే ఉన్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో కూడిన పాఠాలు అందే విధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఒక విద్యార్థి పొందే ఉన్న‌తి కార‌ణంగా సామాజిక ఆర్థిక అస‌మాన‌త‌లు అన్న‌వి తొల‌గిపోతాయి. అందుకే ఆయ‌న అంత శ్ర‌ద్ధ వ‌హించి విద్య‌కు ప్రథ‌మ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు.

రాజాం వచ్చి అమరావతి లొనే రాజధాని ఉండాలి అంటున్నారు చంద్రబాబు. ఆ రోజు రాజ‌ధానిగా చెన్నై ఉన్న‌ప్పుడు మ‌న ప్రాంతం నుంచి 1200 కి.మీ. ప్ర‌యాణించి వెళ్ళాం. తర్వాత కర్నూలు రాజ‌ధానిగా ఉన్న‌ప్పుడు మ‌న ప్రాంతం నుంచి 850 కి.మీ. ప్ర‌యాణించి వెళ్ళాం. తర్వాత హైదరాబాద్ రాజ‌ధానిగా ఉన్న‌ప్పుడు 800 కి.మీ.  వెళ్ళాం. సుమారు 130 ఏళ్ళు రాజధాని కోసం ఇతర జిల్లాలకు వెళ్ళాం. ఇప్పుడు మన వైజాగ్ లోనే పాల‌న సంబంధ రాజధానిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తో ముందుకు  సీఎం వైయ‌స్ జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకు ఈ ప్రాంత ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు ప‌ల‌కాలి. 

అమరావతి క్లోస్డ్ క్యాపిటల్. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతిలో అంటున్నారు. చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు లేదు. ఆయన ఇల్లు హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ను వ్యాపార కేంద్రంగా చూస్తున్నారు..మీరు రాజ‌ధానిని అమరావతిలో ఉంచితే, విశాఖ రాజధానిగా మాకు ఒక రాష్ట్ర ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకుం టాం. దేశం మొత్తం మీద వికేంద్రీకరణకు మద్దతుగా ఉంది. వైజాగ్ రాజధాని వస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. చుట్టూ ఉన్న ఆస్తు ల విలువ పెరుగుతుంది. మన పిల్లలకు ఉద్యోగ అవకాశలు వస్తాయి. 

కుటుంబ అభివృద్ధి చేయడంలో పురుషులు కంటే ఇల్లాలే ఎక్కువ శ్రమిస్తారు, అందుకే ఇల్లాలు పేరుమీద అన్ని పథ‌కాలు ఇస్తు న్నాం..ప‌థ‌కాల వ‌ర్తింపులో లంచగొండిత‌నానికి తావే లేదు. కానీ ఇవ‌న్నీ అందిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశి స్తూ విప‌క్ష నేత సైకో అని అంటున్నారు. నిన్న‌నే ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న పిల్ల‌ల‌కు ట్యాబ్ లు అందించాం. అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో కూడిన స్ట‌డీ మెటీరియల్ ను కూడా అందులో పొందుప‌రుస్తూ ఈ ట్యాబ్ ల‌ను పేద పిల్ల‌ల‌కు అందించాం. అంటే పేద పిల్ల‌లు ధ‌న వంతుల‌యిన పిల్ల‌ల‌తో ఏ మాత్రం తీసిపోకుండా చ‌దువుల్లో రాణించాల‌న్న ముఖ్యోద్దేశంతో ఈ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేశాం. 

ప్రజలను మోస‌గించేందుకు విప‌క్ష నేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. ఆయనను నమ్మితే బోడి గుండు తప్పదు. చంద్రబాబు ఇప్పుడున్న పథ‌కాలు కొనసాగిస్తాను అంటున్నారు. అలాంటప్పుడు ఆయనకు ఎందుకు ఓటు వేయాలి అన్న‌ది ప్రజలు ఆలోచించాలి. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేస్తే, ఎన్నికల ముందు 4 దఫాల్లో మాఫీ చేస్తాను అని జగన్ హామీ ఇచ్చారు.  ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే క్ర‌మాన ఇప్పుడు ఆ అప్పు సీఎం వైయ‌స్ జగన్ తీరుస్తున్నారు. మాటకు కట్టుబడే వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. వంశధార ఫేజ్ 2 పూర్తి చేసి,నాగావ‌ళితో అనుసంధానం చేసి నారాయణపురం నుంచి మీకు నీరు అందిస్తాం. దేశం మొత్తం మీద వికేంద్రీకరణకు మద్దతుగా ఉంది. వైజాగ్ రాజధాని వస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. చుట్టూ ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. మన పిల్లలకు ఉద్యోగ అవకాశలు వస్తాయి.. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఎంపీ బెల్లాల చంద్రశేఖర్, ఎమ్యెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆర్డీఓ శాంతి, మున్సిపల్ కమిషనర్ ఓబులేశు, మెంటాడ స్వరూప్, జెడ్పిటిసి హేమ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top