పాదయాత్ర హామీ మేరకు వాహన మిత్ర పథకం అమ‌లు

మంత్రి పేర్ని నాని

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మూడో విడత వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు 2017 మే మాసంలో సుధీర్ఘంగా నడుస్తూ నడుస్తూ..వాళ్ల కష్టాలు వింటూ..ఏలూరు చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లకు ఈ మాట ఇచ్చారు. రిపేర్లు, ఫిట్‌నెస్‌ కోసం, ఇన్సూరెన్స్‌ వంటి చిన్న చిన్న అవసరాల కోసం ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఆ రోజు సీఎం వైయస్‌ జగన్‌ మనసులో అనిపించి మాట ఇచ్చారు. 

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎక్కడైతే మాట ఇచ్చారో..అక్కడే ఈ పథకాన్ని 2019 అక్టోబర్‌ 4న ప్రారంభించి మొదటి విడతగా ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున అందజేశారు. మళ్లీ 2020లో కరోనా నేపథ్యంలో కష్టకాలంలో నాలుగు నెలల ముందే జూన్‌ 4వ తేదీన ఈ పథకాన్ని అందజేశారు. రెండో విడత కరోనా వచ్చింది..ఇబ్బందులు ఉన్న దృష్ట్య ముందుగానే  ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏ పథకం అమలు చేసినా కూడా అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలోని 2.48 లక్షల ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం ద్వారా రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తున్నారు. ఈ వృత్తి మీద సామాజంలో పేదరికంలో ఉన్న వారు 2.17 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లో ఉన్నారు.  మహిళలకు కూడా ఈ వృత్తిలోకి రావడంతో అలాంటి వారికి కూడా ఈ పథకాన్ని అందజేస్తున్నాం. అలాంటి మహిళలు ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. మగ డ్రైవర్లే తప్పులు చేస్తున్నారని, మహిళలు నిబంధనల మేరకు వాహనాలు నడుపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంపై కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు.  అన్యాయంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. వాస్తవంగా ఆటో డ్రైవర్లకు చాలా తక్కువగా జరిమానాలు విధించాం. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఎలా వేధించాయో లెక్కలు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌ఫోర్టు డిపార్టుమెంట్‌ను సంక్షేమంలో భాగం  చేయడం శుభపరిణామం. ఖాకీ యూనిఫాంను కూడా సంక్షేమ పథకంలో భాగస్వామ్యం చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు
 

Back to Top