ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లు

బస్సును పరిశీలించిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

విజయవాడ: ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆక్సిజన్‌ బస్సుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కోవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్‌ బెడ్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసిన బస్సును మంత్రి పేర్ని నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఆర్టీసీ స్లీపర్‌ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోని ప్రాంతాలకు ఈ ఆక్సిజన్‌ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top