పవన్‌ బేషరత్‌గా ఎందుకు లొంగిపోయారు?

పవన్‌ కల్యాణ్‌ అవకాశ రాజకీయాలు చేస్తున్నారు

అవకాశవాదానికి కొత్త చిరునామా పవన్‌ నాయుడు

ప్రత్యేక హోదా కండిషన్‌ పెట్టి బీజేపీలో చేరవచ్చు కదా?

ఓఎల్‌ఎక్స్‌లో పార్టీని పెట్టిన సైద్ధాంతికతత్వవేత్త పవన్‌ కళ్యాణ్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలతోనే పొత్తు

తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బేషరత్‌గా బీజేపీకి ఎందుకు లొంగిపోయారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. పవన్‌ను మించిన అవకాశవాద రాజకీయవేత్త ఎవరు ఉండరన్నారు. ఓఎల్‌ఎక్స్‌లో పార్టీనీ పెట్టిన సైద్ధాంతికతత్వవేత్త పవన్‌ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ చెప్పేది ఒక్కటి..చేసేది మరొకటి. ఈ భూమి మీద నిఖార్సైన అవకాశ వాద రాజకీయ నేత ఎవరైన ఉన్నారంటే అది పవన్‌ మాత్రమే. వెనుకటి ఒక సామెత ఉంది. ఒక తండ్రి చనిపోతూ మంచంలో పడి ..ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు..నూటికి 90 మందితో చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను. నా చివరి కోరిక నన్ను మంచి అనిపించమని కొడుకును కోరాడంట. కొడుకుకు ఒక్కటే ఆలోచన వచ్చింది. తండ్రి చేసిన చెండాలమైన పనుల కంటే మరి ఎక్కువైన చండాలమైన పనులు చేస్తే కానీ మా నాన్నకు మంచి పేరు రాదనుకొని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. ప్రజలంతా అప్పటి నుంచి తండ్రే నయం..కొడుకు దుర్మార్గుడు అన్నారట. అప్పుడు తండ్రి ఆత్మ శాంతించిందట. చివరి రోజుల్లో నా కొడుకు నా కోరిక తీర్చాడని తృప్తి పొందాడట. ఆ రకంగా పవన్‌ చంద్రబాబు వద్ద మాట తీసుకున్నారు. ఇప్పటి దాకా అవకాశ వాద రాజకీయానికి మారుపేరుగా చంద్రబాబు ఉండేవాడు. నిసిగ్గుగా ..ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించాలని చంద్రబాబు ఆలోచన చేశారు. చంద్రబాబుకు 70 పైచిలుకు వయసు ఉంది. తండ్రి కోరిక ఎలాగు కొడుకు లోకేష్‌ తీర్చలేరని పవన్‌ను కోరినట్లుగా ఉంది. నా కోరిక తీర్చు..నన్ను మంచొడు అనిపించు అని ఉంటాడు.అందుకనే ఆయన చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకునేలా అవకాశ వాద రాజకీయాలు పవన్‌ ఈ రోజు చేయడం ప్రారంభించారు. అవకాశ రాజకీయాలకు కొత్త చిరునామాగా మారిన పవన్‌ నాయుడు ఏం మాట్లాడినా విలువేముంటుంది?.
2014లో పవన్‌  చెప్పిన వారే అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా వారు తీసుకువచ్చిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు. మళ్లీ 2024లో కూడా వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారు. ఇవన్నీ కూడా మనం వింటాం. 
సీఎం వైయస్‌ జగన్‌ అంటే పవన్‌కు అసలు ఇష్టం ఉండదని మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు వైయస్‌ జగన్‌ గురించి మీకేందుకు? ఢిల్లీకి మూడుసార్లు వెళ్లి వచ్చాడు. మోదీ, అమిత్‌షా తాట తీసి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా?. ప్రమాణస్వీకారం కంటే ముందే చెప్పారు. మోదీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలిచారు. బేషరత్‌గా వాళ్ల కాళ్లు పట్టుకునే ముందు విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామన్నారు కదా ..దాన్ని తీసుకురావచ్చు కదా?. బేషరత్‌గా పవన్‌కు ఎందుకు భయం?. వైయస్‌ జగన్‌పై సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి కేసులు పెట్టించారు. మీపై ఉన్న కేసులు ఏంటో మాకు తెలియదు. ఎందుకు బేషరత్‌గా లొంగిపోయారు?. ఇవాళ ఓఎల్‌ఎక్స్‌ అనే యాప్‌ ఉంది. ఎవరికి ఏం కావాలో అందులో బేరం పెట్టవచ్చు. ఓఎల్‌ఎక్స్‌లో రాజకీయ పార్టీని కూడా పెట్టవచ్చు అన్నది ఈ మధ్యే అర్థమవుతోంది. ఓఎల్‌ఎక్స్‌లో ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఆఫర్‌ పెట్టుకునే సైద్ధాంతికతత్వవేత్త మాటలకు ఇంక విలువేం ఉంటుంది?. ప్రజాశాంతి పార్టీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలన్నీ కూడా చంద్రబాబు చెప్పినట్లే చేస్తాయి. ఇదంతా కూడా చంద్రబాబు గేమ్‌లో ప్లానే. దాని గురించి మేం పెద్దగా ఆలోచించడం లేదు. వైయస్‌ జగన్‌, వైయస్‌ఆర్‌సీపీ ఈ రాష్ట్ర ప్రజలను నమ్ముకుంది. ప్రజలే మాకు పొత్తు..వాళ్లతోనే అన్ని కూడా. ఎత్తులు, పైఎత్తులు అన్నీ కూడా చంద్రబాబుకు సరిపోతాయి. వాళ్లు ఏం మాట్లాడినా పరిగణలోకి తీసుకోం. 

తాజా వీడియోలు

Back to Top