ఎన్టీఆర్‌ పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాం

పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇప్పటికే జిల్లాల పునర్విభజన పూర్తిచేశాయని గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సత్వరమే అందడానికి జిల్లాల పునర్విభజన దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు, వర్గాలు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం నెలకొందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, పదవిని లాక్కుని ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. పాదయాత్రలో కృష్ణా జిల్లాలకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ చేసిన విధంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ పేరు ఎందుకు పెట్టలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 
 

Back to Top