నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ప్రజలు తిరుపతి ఉప ఎన్నికలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి వేసి ముఖ్యమంత్రి రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ససోమవారం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు సందర్భంగా నెల్లూరులో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..వైయస్ఆర్‌సీపీ తరఫున ఓ సామాన్య వ్యక్తి, దళితుడైన డాక్టర్ గురుమూర్తికి సీఎం వైయస్ జగన్ అవకాశం కల్పించారన్నారు. ప్రతిపక్షాల నుంచి ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, ఒక మాజీ సీఎస్ పోటీ చేస్తున్నారని తెలిపారు. మా అభ్యర్థి విజయానికి సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలే అత్యధిక మెజారిటీని ఇస్తాయని చెప్పారు. దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.