నరసాపురం: చంద్రబాబు ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఐదు నెలల్లో చేసి చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. నరసాపురం పట్టణంలోని మేధర్ల వంతెన వద్ద శాసన సభ్యుడి నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ, మార్కెటింగ్ , పశు సంవర్థక శాఖా మాత్యులు మోపిదేవి వెంకటరమణ, పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘు రామకృష్ణ రాజు , శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం వైయస్ జగన్ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రైతులకు నాలుగేళ్ల పాటు రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైయస్ జగన్ ..అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఐదేళ్ల పాటు ఇస్తున్నారని, గతంలో రూ.12500 ఇస్తామని చెప్పగా, ఇప్పుడు మరో వెయ్యి అదనంగా పెంచి రూ.13,500 చొప్పున ఇస్తున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేశారని, ఇలా అన్ని వర్గాలకు వైయస్ జగన్ తోడుగా నిలిచారన్నారు. ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ చంద్రబాబు, లోకేష్ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని వారు పేర్కొన్నారు. Read Also: ప్రజలంతా సంయమనం పాటించాలి