ప్రజలంతా సంయమనం పాటించాలి

అయోధ్య తీర్పుపై సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌
 

అమరావతి: అయోధ్య తీర్పుపై ప్రజలందరూ సంయమనం పాటించి శాంతిభద్రతలకు సహకరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీం కోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకు విజ్ఞప్తి’ చేశారు. ప్రజలంతా సంయమనం పాటించి శాంతిభద్రతలకు సహకరించమని సీఎం కోరారు.

Read Also: రైతు భరోసాకు విశేష ‘స్పందన’ 

తాజా ఫోటోలు

Back to Top