రాజధాని ఎక్కడికి తరలిపోవడం లేదు

 మంత్రి మోపిదేవి వెంకటరమణ 
 

గుంటూరు: రాజధాని ఎక్కడికి తరలిపోవడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. నరసరావుపేట సభలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉద్యమాలు వస్తున్నాయని గత నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. అమరావతికి ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు అసమానతలు ఏర్పరిచి కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారని మోపిదేవి మండిపడ్డారు. 
 

తాజా వీడియోలు

Back to Top