చంద్రబాబువన్నీ చిల్లర రాజకీయాలు

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆందోళన పేరుతో డ్రామా

రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అండగా ఉంటారు

పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

 

విజయవాడ: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ చిల్లర రాజకీయాలకు చంద్రబాబు తెరలేపాడని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. తాత్కాలికం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఐదేళ్లు కాలయాపన చేసి ఈ రోజున జోలె పట్టుకొని చందాలు వసూలు చేస్తున్నాడన్నారు.రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అహర్నిశలు కష్టపడుతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కానీ, టీడీపీ ఉనికి కాపాడుకునేకునే తాపత్రయంలో భాగంగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లుగా మహాడ్రామాకు చంద్రబాబు తెరతీశాడని మండిపడ్డారు. హైపవర్‌ కమిటీ భేటీ అనంతరం మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ అధికారం చేపట్టిన ఏడు మాసాల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రజాబలంతో సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపాదన తీసుకువచ్చారని, ఈ తరుణంలో రాష్ట్రానికి ఎక్కడా లేని అన్యాయం జరుగుతుందని అభూత కల్పన క్రియేట్‌ చేసి ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఉద్యమాల పేరుతో చిల్లర రాజకీయాలకు తెరలేపాడని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తాబేదారులంతా వారి ఉనికిని కాపాడుకోవడానికి ఉద్యమాల పేరుతో డ్రామాలు చేస్తున్నారన్నారు. 2014లో అధికారం ఇచ్చిన తరువాత అమరావతిలో తాత్కాలిక రాజధాని పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి కారుచౌకగా కొట్టేసిన చంద్రబాబు నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాత్కాలికం పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈ రోజు జోలె పట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి అన్యాయం జరుగుతుందని చందాలు వసూలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని, రాజధాని రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారన్నారు.

తాజా వీడియోలు

Back to Top