మత్స్యకారులను ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు

 మోపిదేవి వెంకటరమణ

తూర్పు గోదావరి: మత్స్యకారులను ఇన్నాళ్లు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరే ఈ సామాజిక వర్గాన్ని అన్ని విధాల ఆదుకుంటున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభోత్సవంలో మోపిదేవి మాట్లాడారు. 
ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సామాజిక వర్గం స్థితిగతులపై కొద్దిసేపు చర్చించుకునే సువర్ణ అవకాశం దక్కిందన్నారు.మత్స్యకార సామాజిక వర్గం స్థితిగతులపై పరిపూర్ణ అవగాహన కలిగిన సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే అరుదైన ఘటన అన్నారు. 1100 కిలోమీటర్ల సువిశాలమైన తీరప్రాంతంలో పొట్టి కూటి కోసం కడలి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న అమాయక మత్స్యకారులను గతంలో ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారు. అలాంటి పరిస్థితులకు భిన్నంగా సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో మన కష్టాలు కళ్లారా చూశారన్నారు. అన్ని విధాల అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్నారు. ఈ రోజు మత్స్యకార సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను గాడిలో పెడుతూ..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ..హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. నమ్మిన కుటుంబాలకు ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి ఆదుకుంటున్నారని తెలిపారు. డీజిల్‌ సబ్సిడీ రూ.9 వరకు పెంచుతూ..ఏ రోజుది ఆరోజే ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న జీఎస్పీ నిధులను మత్స్యకారులకు అందిస్తున్నారన్నారు. రూ.1.50లకే కరెంటు ఇచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ పథకాలన్నీ మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మార్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్వా రంగాన్ని ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని మోపిదేవి వెంకటరమణ సీఎం వైయస్‌ జగన్‌ను కోరారు. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు

Back to Top