సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని డిప్యూటీ సీఎం పల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ మత్స్యభరో్సా ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే..ఐదేళ్లు ప్రజలు మనకు అధికారం ఇచ్చారని నాలుగేళ్లు అధికారం అనుభవించి చివరి ఏడాది హడావుడిగా పనులకు శంకుస్థాపన చేస్తుంటారన్నారు. కానీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. మనకు మాట ఇవ్వకపోయినప్పటికీ ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం సజావుగా అమలవుతుందని, ప్రలోభాలకు లోనైతే పేదలే నష్టపోతారని ఆరోజు డాక్టర్‌ అంబేద్కర్‌ అన్నారని గుర్తు చేశారు.  వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకు తీసుకెళ్తున్నారని, ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ పాలనను సమర్ధించాలని కోరారు. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకుంటారని మా నమ్మకం

తాజా ఫోటోలు

Back to Top