సీఎం వైయస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకుంటారని మా నమ్మకం

మత్స్యకార దినోత్సవం మత్స్యకారుల మధ్య జరుపుకోవడం ఇదే మొదటిసారి

మత్స్యకారులకు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారు

వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసాతో మత్స్యకారులకు మేలు

తూర్పుగోదావరి జిల్లా: మత్స్యకారులకు ఏదైనా కష్టం వస్తే గంగమ్మ తన కడుపులో పెట్టుకుంటుదని ఇన్నాళ్లు నమ్మామని, ఇవాళ్టి నుంచి మాకు రెండో ధైర్యం కూడా ఉందని..వైయస్‌ జగన్‌ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మత్స్య దినోత్సవాన్ని మత్స్యకారుల మధ్య నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. మత్స్యకారుల జీవితాలను మార్చాలని ఏ ఒక్కరూ ఆలోచించలేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మత్స్యకారులతో ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యకారులు తినడానికి తిండి లేక, ఉండటానికి ఇళ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. పాదయాత్రలో మత్స్యకారుల బాధలు విన్నారని, మనకు తోడుగా ఉంటారని చెప్పారు. ఆగిపోయిన నష్టపరిహారాన్ని సీఎం చేతుల మీదుగా పరిహారం అందిస్తారన్నారు. 2012లో వేట సమయంలో ఆయిల్‌ నిక్షేపాలు వెలికితీసే సమయంలో మత్స్యకారులకు నష్టం జరుగుతుందని పోరాటం చేశామన్నారు. పేద మత్స్యకారులకు మేలు చేసేందుకు ఉద్యమం ప్రారంభించామన్నారు. సుమారు 60 గ్రామాల ప్రజలు గాంధీయ మార్గంలో 103 రోజుల పాటు నిరాహారదీక్ష చేశామన్నారు. 250 బోట్లతో సముద్రంలోకి వెళ్లిఆ రోజు రిగ్గును ఆపామన్నారు. దీంతో ఆరు నెలల కాలానికి నష్టపరిహారం ఇచ్చారన్నారు. ప్రభుత్వం మారిన తరువాత మత్స్యకారుల గురించి గత పాలకులు ఆలోచన చేయలేదన్నారు. వైయస్‌ జగన్‌ మన ప్రాంతానికి వచ్చిన సమయంలో మనకు రావాల్సిన పరిహారం విషయం చెప్పడంతో, వైయస్‌ జగన్‌ ఆ రోజు తాను ఇస్తానని, ముఖ్యమంత్రి కాగానే మేలు చేస్తానని మాటిచ్చారన్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే అసెంబ్లీ సమావేశాల్లో పరిహారం విషయం సీఎంతో చర్చించామన్నారు. మత్స్యకారులకు డబ్బులు ఎప్పుడు ఇద్దామని సీఎం స్వయంగా చెప్పడం ఆనందంగా ఉందన్నారు. గతంలో 600 హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపిన నాయకుడిని చూశాం. ఇచ్చిన హామీని తూచా తప్పకుండా, కంపెనీ ఇవ్వాల్సిన సొమ్మును ప్రభుత్వం తరఫున సీఎం వైయస్‌ జగన్‌ ఇవ్వడం గొప్పదన్నారు.ఇవాళ మన జీవితాలు బాగుపడాలని, రేపు మన పిల్లల కోసం వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారన్నారు. మత్స్యకారులంతా కూడా నిరుపేదలని, మాలో మార్పు రావాలంటే చదవే మార్గమన్నారు. మత్స్యకార గ్రామాల్లో నిర్భంద విద్య ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సతీష్‌ సీఎంను కోరారు. ఆరోగ్యం విషయంలో ఇవాళ చాలా దారుణంగా ఉందన్నారు. రహదారులు లేని 20 గ్రామాలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి మత్స్యకారుడికి ఇళ్లు నిర్మించేందుకు అదనంగా రూ.20 వేలు ఇచ్చారని, రేపు ఇల్లు నిర్మాణానికి ఈ విషయంలో మంచి చేయాలని కోరారు. సముద్రంలో వేటకు వెళ్లే వారికి మాత్రమే  ఇప్పటి వరకు పరిహారం ఇస్తున్నామని, అందరికీ అవకాశం కల్పించాలన్నారు. గతంలో చంద్రబాబు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. ఆ హామీపై ప్రశ్నిస్తే తోలు తీస్తామని చంద్రబాబు హెచ్చరించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సతీష్‌ సీఎంను కోరారు. కోనసీమ ప్రాంతంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారని, అంబేద్కర్‌ అంటే ఇక్కడి ప్రజలకు దేవుడితో సమానమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని సీఎంను కోరారు. 

Read Also: వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం

Back to Top