శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం బీచిగానిపల్లి పంచాయతీ పరిధిలోని వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘కాఫీ విత్ వైయస్ఆర్‌సీపీ క్యాడర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చా్జ్ కె.వి. ఉషశ్రీచరణ్ పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిందని ప్రజలకు వివరించారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగించిన జననాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారేనని గుర్తు చేశారు. రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా, పంట నష్టపోయినా పంట బీమా అందించి రైతులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు జగనన్న గారని తెలిపారు. ఇందుకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజలకు స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచిగానిపల్లి పంచాయతీలో పంచాయతీ కమిటీ సమావేశం నిర్వహించగా, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, బీచిగానిపల్లి పంచాయతీతో పాటు వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.