వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సంక్రాంతి శుభాకాంక్షలు

తాడేపల్లి: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన అన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడి, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను మరింతగా పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Back to Top