పూల ప్రసాద్ మృతికి వైయస్ఆర్‌సీపీ నేత‌ల సంతాపం

అనంత‌పురం: శింగణమల మండలం వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్ పూల ప్రసాద్ మృతి పట్ల అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అనంతపురంలోని కిమ్స్‌ సవేరా ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ, మంగళవారం ఉదయం పూల ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, తలారి రంగయ్య, ఎన్నారై విభాగం కన్వీనర్ ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డితో పాటు ఇతర పార్టీ నాయకులతో కలిసి పూల ప్రసాద్ భౌతికకాయానికి నివాళులర్పించారు
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, “ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం. పూల ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు” అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూల ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.

Back to Top