తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో శ్రీ వైయస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శివలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.