సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు

విజయవాడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో చిక్కుకున్న మమ్మల్ని రాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటామని మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌ నుంచి 12 బస్సుల్లో బయలుదేరిన 850 మంది మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. వారికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ..కరోనా వైరస్‌ కారణంగా తాము ఇక సముద్రానికే పరిమితమవుతామని భయంతో బతికామన్నారు. మా కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి రప్పించారన్నారు. మార్గం వెంట తమకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారని, మనస్సున ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మరోసారి రుజువు అయ్యారని పేర్కొన్నారు.

స్ర్కినింగ్‌ చేశాకే..స్వస్థలాలకు: మంత్రి మోపిదేవి
గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన మత్స్యకారులకు స్క్రినింగ్‌ చేశాకే వారి స్వస్థలాలకు పంపిస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో గుజరాత్‌ నుంచి మత్స్యకారులను ఏపీ రప్పించడంలో సీఎం వైయస్‌ జగన్‌ చూపిన చొరవ మరువలేనిదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబులాగా వైయస్‌ జగన్‌ హైటెక్‌ ముఖ్యమంత్రి కాదని, వాస్తవానికి దగ్గరగా వైయస్‌ జగన్‌ ఉంటారని తెలిపారు. ప్రజలకు ఏవి అవసరమో అది చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తుంటారని, మానవత విలువలు కలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నామని, రాజమండ్రిలో భోజన ఏర్పాట్లు చేశామన్నారు. మత్స్యకారులను ఏపీకి రప్పించిన ముఖ్యమంత్రికి మోపిదేవి వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు. 

Back to Top