జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ కార్యక్రమం కూడా గొప్పది

జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కార్య‌క్ర‌మంలో మంత్రి మేరుగ నాగార్జున‌

తాడేప‌ల్లి: జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ కార్యక్రమం కూడా గొప్ప కార్యక్రమమ‌ని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  సీఎం వైయ‌స్ జగన్ జ‌మ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఏమన్నారంటే...వారి మాటల్లోనే

 
 
మేరుగు నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి

అందరికీ నమస్కారం, ఈ రెండు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకమైనవి, 2016–17, 2017–18 లో 3,326 మంది విద్యార్ధులకు సంబంధించి దాదాపు రూ. 318 కోట్ల గత ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేసింది. మన ప్రభుత్వం నాటి అవకతవకలపై విజిలెన్స్‌ ఎంక్వైరీ కూడా వేసింది, గతంలో ఈ స్కీమ్‌ను ఇష్టారీతిగా మార్చేశారు, రకరకాలుగా అవకతవకలు చేశారు, కానీ మన ప్రభుత్వం గొప్ప ఆలోచనతో గొప్ప యూనివర్శిటీలలో రూ. 1.25 కోట్లు ఇస్తున్నాం, ప్రతిష్టాత్మక యూనివర్శిటీలలో మనం వారికి చదువుకునే అవకాశం ఇస్తున్నాం, దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారు, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ కార్యక్రమం కూడా గొప్ప కార్యక్రమం, మన రాష్ట్రం నుంచి అనేకమంది సివిల్‌ సర్వీసెస్‌ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్యూ సార్‌. 

 షేక్‌ సనా, విద్యార్ధిని, విజయవాడ, యూఎస్‌ఏ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో..

నమస్తే సార్, నేను జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాను, జగనన్న విదేశీ విద్యా దీవెన స్కాలర్‌షిప్‌ నాకు చాలా ఉపయోగపడింది, ఈ స్కీమ్‌ ద్వారా నేను లబ్ధిపొందాను, మీకు కృతజ్ఞతలు సార్, మీ నాన్నగారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారి లాగా మీరు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు, విద్యారంగంలో మీరు తీసుకొచ్చిన పాలసీలు నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి, నేనే కాదు నాలాంటి అనేకమంది పేద విద్యార్ధుల జీవితాలలో వెలుగులు వచ్చాయి, నేను ఏదో ఒక రోజు నా స్ధాయిలో సమాజానికి సేవ చేస్తానని మాట ఇస్తున్నాను, ఏపీ ప్రజల తరపున, నాలాంటి లబ్ధిదారుల తరపున మీకు ముందస్తుగా జన్మదిన, క్రిస్మస్‌ శుభాకాంక్షలు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్‌. 

చంద్రసాయిక్రిష్ణ, రామాపురం, నగరి, చిత్తూరు జిల్లా నుంచి, మొనాష్‌ యూనివర్శిటీ ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ అడ్మిషన్‌ పొందారు. 

సార్, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను విదేశాలలో చదువుకోవాలన్నది నా చిన్ననాటి కల, నా కలను ఈ స్కీమ్‌ సాకారం చేసింది, మీరు నగరిలో విద్యాదీవెన కార్యక్రమానికి వచ్చినప్పుడు విదేశీ విద్యాదీవెన గురించి చెప్పారు, నేను కూడా ఆ సభలో పాల్గొన్నాను, ఆ సమావేశంలో మీ ప్రసంగం నాకు స్పూర్తినిచ్చింది, నేను అప్లై చేయగానే ఆస్ట్రేలియా యూనివర్శిటీలో సీట్‌ పొందాను, ఈ స్కీమ్‌ నాకు వచ్చింది, నా ఫీజు మొత్తం రూ. 55 లక్షలు ఇస్తున్నారు, నాలాంటి అనేకమంది పేద విద్యార్ధులకు ఈ పథకం ఒక వరం, విద్యారంగంలో మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, నేను అన్నీ కూడా ప్రత్యక్షంగా చూశాను, మా కుటుంబం కూడా అనేక సంక్షేమ పథకాలు పొందుతుంది, ఈ వరం ఇచ్చింది మీరే సార్, అనేకమంది ముఖ్యమంత్రులను చూశాం కానీ విద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చింది మాత్రం మీరే సార్, మీరు సీఎంగా మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వలేదు, ఎవరూ అడగలేదు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 

పెందెం ప్రత్యూష్, సత్తెనపల్లి, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పొందుతున్న లబ్ధిదారు, పల్నాడు జిల్లా, సివిల్స్‌ ఇంటర్య్వూకి ఎంపికయ్యారు.

సార్‌ నమస్కారం, మీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు, మాది మధ్యతరగతి కుటుంబం, మా నాన్నమ్మ గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో వంట మనిషిగా పనిచేశారు, మా నాన్నమ్మ మా నాన్నను బాగా చదివించి న్యాయవాదిని చేశారు, మా నాన్న నన్ను బాగా చదివించి డాక్టర్‌ను చేశారు, నేను ఐఏఎస్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను, నేను ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత సివిల్స్‌కు ట్రై చేశాను, మొదట్లో ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయి మొయిన్స్‌ సాధించలేకపోయాను, చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, సీఎంగారు ఇలాంటి స్కీమ్‌ పెడుతున్నారని తెలిసి చాలా స్పూర్తిపొందాను, మెయిన్స్‌ దాటి ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ఇంటర్వ్యూ ఉంది, నాలాగా అనేకమంది ఇప్పుడు మళ్ళీ సివిల్స్‌ వైపు వెళుతున్నారు, విద్య మాత్రమే జీవితాలను మార్చగలిగింది అని మీరు నమ్మారు, దానిని ఆచరణలో పెట్టారు, ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తుంది, మీ స్కీమ్స్‌ చాలా బావున్నాయి, నేను నా ఇంటర్వ్యూ పూర్తి చేసి మీ డైనమిక్‌ లీడర్‌షిప్‌లో పనిచేయాలనుకుంటున్నాను, మీ విజన్‌ను ముందుకు తీసుకువెళతాను, థ్యాంక్యూ వెరీమచ్‌ సార్‌.

Back to Top