విద్యా వ్యవస్దకు ఊపిరి పోసింది వైయ‌స్ఆర్ కుటుంబ‌మే

మంత్రి మేరుగ నాగార్జున‌
 

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో విద్యా వ్యవస్దకు ఊపిరి పోసింది నాడు  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి..నేడు ఆయ‌న కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మేన‌ని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నేడు విద్యావ్యవస్దను మరింత మెరుగుపరుస్తున్నార‌ని చెప్పారు. విద్యా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపారు. అసెంబ్లీలో స‌భ్యుల తీరుపై మంత్రి మేరుగ నాగార్జున మండిప‌డ్డారు. ఎస్సీలలో ఎవరయినా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. బాబొస్తే జాబొస్తుందని హామీ ఇచ్చి ఆ హామీని అటకెక్కించిన ఘనత చంద్రబాబుది అని విమ‌ర్శించారు.

Back to Top