గుంటూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీలను తలెత్తుకునేలా జీవింపచేసింది ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వేమూరు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తలెత్తుకునేలా చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి గుండెల్లో నిలిచేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జనం కోసం పరితపించే నాయకుడు వైయస్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని కొనియాడారు. మరో 30 ఏళ్లు వైయస్ జగనే సీఎం రాష్ట్రానికి మరో 30 సంవత్సరాల పాటు వైయస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి మేరుగ నాగార్జు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సంక్షేమ పథకాలు, ఆయన పాలన నేడు దేశానికే డిక్సూచిలా మారాయన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు .ఈ మూడేళ్ళలో లక్షా 71 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసాడని పేర్కొన్నారు. మంచి చేశాము కాబట్టే ఈరోజు తలెత్తుకుని గడప గడపకు వెళ్లి, ఇల్లిళ్ళు తిరిగి జగనన్న చేసిన మేలు చెబుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.