నాలుగు ఫిషింగ్ హార్బ‌ర్ల‌కు కేంద్రం నిధుల‌ సాయం

మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కేంద్ర మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ హామీ

ఢిల్లీ: రాష్ట్రంలోని నాలుగు ఫిషింగ్ హార్బర్లకి కేంద్రం నుంచి 50శాతం నిధుల సాయం చేస్తామని  కేంద్రమంత్రి మాండవీయ తెలిపారని రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో మంత్రి మేక‌పాటి చర్చించారు. ఈసందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. రామాయపట్నం లేదా భువనపాడు పోర్టుల్లో ఏది బాగుంటే అది తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారన్నారు.  రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా కేంద్రం తీసుకోవాలని రాష్ట్రం తరఫున చెప్పామన్నారు. సాగరమాల పథకంలో ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మెట్రిక్ జోన్‌లో ఎంఆర్ఐ కేంద్రాలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి రెండు నెలల్లో రాష్ట్రానికి వస్తామని చెప్పారని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top