ఏపీ ఐటీ రంగం మరింత బలోపేతం

 మంత్రి గౌతంరెడ్డి

విశాఖపట్నం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసంలో పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్ రెడ్డితో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాలతో  జిల్లాలో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ..ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, టూరిజం శాఖ సంయుక్తంగా ఒక మీటింగ్ విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకు వస్తామని... అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.  ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని  తెలిపారు. మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని,  దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు  లభించాయని మంత్రి గౌతం‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top