రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలు

మంత్రి కొడాలి నాని
 

విజయవాడ:  రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా ఉంటుంద‌ని, ఏ ఒక్క‌రూ న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతో రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరిస్తామని మంత్రి  తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం నమూనాలు పరిశీలించి.. రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని.. ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top