చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ నీచ రాజ‌కీయం 

మంత్రి కొడాలి నాని

విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బూట్లు వేసుకుని తిరుమల కొండ ఎక్కితే.. సీఎం వైయ‌స్‌జగన్‌ చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారని తెలిపారు. ‘‘తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా..? ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా?. చంద్రబాబు ఏనాడైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నారా?’’ అంటూ మంత్రి నిలదీశారు.  

దేవుళ్ల‌ను కించ‌ప‌ర‌చ‌లేదు..

తాను ఏనాడూ దేవుళ్లను కించపరచలేదని, ఆంజనేయ స్వామిపై నేను ఒకటి మాట్లాడితే.. టీడీపీ మరొకటి దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని ధ్వజమెత్తారు. ‘‘సీఎం వైయ‌స్‌ జగన్‌ తిరుపతికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు తిరుమల వెళ్లారు. భవిష్యత్‌లో కూడా వెళతారు. టీడీపీ, బీజేపీలు హిందువులు పేరుతో రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అన్ని మతాలు, కులాలు ఒక్కటే. నా మెడలో అన్ని మతాల దండలు వేసుకుంటాను. నాకు అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యానని’’ కొడాలి నాని పేర్కొన్నారు.

Back to Top