ఆంధ్రరాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుంది

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తిరుపతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు, విమర్శలు, కుట్రలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌ ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. జీడీపీలో ఏపీ మొదటి స్థానంలో, విద్యలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఆయనకు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 
 

తాజా వీడియోలు

Back to Top