చిల్లకల్లు వైయ‌స్ఆర్‌సీపీ నేత దొంగల రాంబాబు మృతిపై పార్టీ నేతల నివాళి 

 
ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ వైయ‌స్ఆర్ 
 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగల రాంబాబు హఠాత్తుగా మరణించడంతో పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించాయి.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులు, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం రాంబాబు చేసిన సేవలు మరువలేనివని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి స్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
 

Back to Top