శాశ్వత పరిష్కారం చూపుతాం

పెద్దాపురం, పిఠాపురం రైతులకు మంత్రి కన్నబాబు హామీ

నవర ఏరుకి గండ్లు పడిన ప్రదేశం పరిశీలన 

తూర్పుగోదావరి: భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నవర ఏరుకి గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి కన్నబాబు పరిశీలించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఏరు వరదలతో పెద్దాపురం, పిఠాపురంలో పంటలకు తీవ్రనష్టం జరిగిందని, గండ్లు పడిన ప్రదేశాల్లో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించామని రైతులకు చెప్పారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం జరిగిందన్నారు. ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి ఉందని, భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, అన్నదాతలను ఆదుకుంటామన్నారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నామ‌ని తెలిపారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారన్నారు.

Back to Top