సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై పెరిగిన ప్రజావిశ్వాసం

అన్ని మున్సిపాలిటీలను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుంది

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో విశ్వాసం రెట్టింపు అయ్యిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌తో క‌లిసి మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రజలందరి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు మాయమాటలు ప్రజలెవరూ నమ్మరని, ఎన్ని స్థానాల్లో విజయం సాధించారో చంద్రబాబు చెప్పగలడా అని ప్రశ్నించారు.  

Back to Top