వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్‌

రైతుకు ఎంత మేలు చేసినా అది తక్కువే అనే ఆలోచన వైయస్‌ కుటుంబానిది

అన్నదాత సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు

కౌలు రైతుకు అండగా నిలిచిన నాయకుడు మన ముఖ్యమంత్రి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

 

వైయస్‌ఆర్‌ జిల్లా: రైతు సంక్షేమం అంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు గుర్తుకువస్తుంది. వ్యవసాయం దండగ కాదు.. పండుగలా చేస్తానని ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ నేటికీ ప్రజలందరి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.  ఆయన జన్మదినాన్ని రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించుకోవడం మన బాధ్యతగా భావిస్తున్నామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు పాల్గొని మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 40 రోజుల్లో తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రజలందరికీ తెలుసన్నారు. పెట్టుబడి సాయం కింద రూ. 12,500 రైతు భరోసా మొదలుకొని ఉచితంగా బోర్లు వేసే వరకు ఎన్నో కార్యక్రమాలను చాలా సునాయాసంగా ప్రకటించారని చెప్పారు. రైతుకు ఎంత చేసినా తక్కువేననే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఉన్నారన్నారు. రైతు భరోసా కోసం రూ. 8,750 కోట్లు, వడ్డీలేని రుణాల కింద దాదాపు రూ. 2 వేల కోట్లు, ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే చెల్లించేందుకు సుమారు రూ. 2 వేల కోట్లపైనే, ఉచిత బోర్లు వేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒర రిగ్గు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఒక ల్యాబ్‌ ఇవన్నీ తక్షణమే ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారని వివరించారు. 

ఈ రాష్ట్రంలో కౌలు రైతుల గురించి మాట్లాడే ధైర్యం చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుందని, కానీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రోజునే కౌలు రైతుల సంక్షేమం గురించి మాట్లాడి.. వారికి కూడా ఇతర రైతులతో సమానంగా పథకాలు అందజేస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు.

Back to Top