బాబే అరిష్టం, దరిద్రం.. కరువు కాటకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

కుళ్లూ కుట్రల విష రాజకీయాలకు నిలువెత్తు రూపం

నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబునాయుడు

నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు

మంత్రి  కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ

నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు. ఆయన మరణానికీ కారకుడు

రాష్ట్రానికి పట్టిన శని, గ్రహణం చంద్రబాబు అన్న ఎన్టీఆర్‌

రౌడీలు, గుండాల అరాచకాలకు అండనిచ్చేవాడు చంద్రబాబు

ఈ మాట స్వయంగా చెప్పిన చంద్రబాబు తోడల్లుడు

గుర్తు చేసిన మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కమీషన్లకు కక్కుర్తి పడింది చంద్రబాబే

అప్పుడే నిర్మాణాలు పూరై్తతే, లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు? 

కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం

నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫొటోలు దిగే దమ్ముందా?

చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌

నెల్లూరు:  చంద్ర‌బాబే రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం.. కరువు కాటకాలకు బ్రాండ్‌ అంబాసిడర్ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిప‌డ్డారు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నాయత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నామ‌ని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతున్నామ‌ని తెలిపారు. అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు కూడా టీడీపీకి చాలా చోట్ల అభ్యర్థులు లేనే లేర‌న్నారు. అందుకే 175 చోట్ల పోటీ చేస్తామని చంద్రబాబు చెప్పడం లేద‌ని చెప్పారు.  నెల్లూరు క్యాంప్‌ ఆఫీస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌:
    వినూత్న పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై, విపక్షనేత చంద్రబాబు పిచ్చి విమర్శలు చేస్తున్నారు. నోటికి ఎంత వస్తే, అంత మాట్లాడుతున్నారు. నిజానికి చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టం. దేశానికి దరిద్రం. ఆయన కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఇది రాష్ట్రంలో ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన పాలనంతా కరువు కాటకాలే.

నిలువల్లా విషం:
    చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుళ్లూ, కుట్రలే. విష రాజకీయాలకు ఆయన నిలువెత్తు రూపం. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. నయవంచన రాజకీయాలకు ఆద్యుడూ చంద్రబాబే. దరిద్రం, అరిష్టం, కరువు, కాటకం చంద్రబాబు పేరుకు పర్యాయ పదాలని చెప్పాలి. ఆయన పాలనంతా కరవే. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ఎన్టీఆర్‌ ఆత్మక్షోభ:
    వెన్నుపోటుతో సీఎం పదవితో పాటు, పార్టీని కూడా లాక్కున్నత చంద్రబాబు, ఆనాడు ఎన్టీఆర్‌ను ఆత్మక్షోభకు గురి చేశాడు. అందుకే బాబు పేరు చెబితే ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించదు. చంద్రబాబు వంటి నేల టికెట్‌ వ్యక్తికి పిల్లనివ్వడమే కాకుండా, రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఒక నయవంచకుడిగా చరిత్రకు ఎక్కాడు. రాష్ట్రానికి పట్టిన శని, గ్రహణం చంద్రబాబు అని అందుకే ఆనాడు స్వయంగా ఎన్టీఆర్‌ అన్నారు. రౌడీలు, గుండాల అరాచకాలకు అండనిచ్చే వ్యక్తి చంద్రబాబు, అని స్వయంగా ఆయన తోడల్లుడు అన్నాడు. 

టిడ్కో ఇళ్లలో కమిషన్ల కక్కుర్తి:
    రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను చంద్రబాబు కమిషన్ల కక్కుర్తికి వాడుకున్నాడు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించడంతో, ఆ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. దీంతో ఎక్కడా టిడ్కో ఇళ్లు పూర్తి కాలేదు. ఒకవేళ చంద్రబాబు హయాంలోనే టిడ్కో ఇళ్లు పూరై్త ఉంటే, వాటిని అప్పుడు లబ్ధిదారులకు ఎందుకు అందజేయలేదు?.
    చంద్రబాబు తన హయాంలో ప్రతి పనిలోనూ కాసుల కోసం కాంట్రాక్టర్లను పీడించాడు. అందుకే అన్ని చోట్లా నాసిరకం పనులే. సాక్షాత్తూ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలో జరిగిన అవినీతిని మేం శాసనసభ సాక్షిగా ప్రజల ముందుకు తెచ్చాం.

వాటి దగ్గర సెల్ఫీలు దిగగలవా?:
    చంద్రబాబు హయాంలో నెల్లూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఎక్కడా అభివృద్ధి అనేది లేదు. టిడ్కో ఇళ్ల దగ్గరకెళ్లి సెల్ఫీ దిగిన చంద్రబాబు, సంగం, నెల్లూరు బ్యారేజీల దగ్గర కూడా అలా చేయగలడా? ఆ పని చేసే ధైర్యం నీకుందా బాబూ?. నీవు అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయావు?. ఇకనైనా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టాలన్న ఆలోచన మానుకో.

ఏం చేశావనేది చెప్పుకోగలవా?:
    మేం ఈ 46 నెలల్లో ప్రజలకు ఏమేం చేశాం? ఎంత మేలు చేశామనేది ధైర్యంగా చెప్పగలం. అందుకే గడప గడపకూ కార్యక్రమం చేపట్టాం. ఇల్లిల్లూ తిరిగి, ఆ ఇంట్లో వారికి ఏ స్థాయిలో మేలు జరిగిందన్నది చూపుతున్నాం. 
    మరి మా మాదిరిగా ఇల్లిల్లూ తిరిగే ధైర్యం మీకుందా? నిజంగా మీరు ప్రజలకు మేలు చేసి ఉంటే, ఆనాడు మీరు ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేపట్టలేదు?. మీరు ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే, వారి ముందుకు వెళ్లే ధైర్యం మీకు లేదు. ఇది వాస్తవం. 

మీకసలు అభ్యర్థులే లేరు:
    మూడు ఎమ్మెల్సీ సీట్లు గెల్చినంత మాత్రాన.. ఏకంగా ‘వై నాట్‌ పులివెందుల?’ అంటున్నారు. నిజానికి ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏమిటి? మేం ధైర్యంగా వైనాట్‌ 175 అంటున్నాం. కానీ నీవు అన్ని చోట్ల పోటీ చేస్తామని కూడా చెప్పలేక పోతున్నావు. అంటే మీకసలు అన్ని చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. ఇది నిజం కాకపోతే, మొత్తం 175  స్థానాల్లో సైకిల్‌ గుర్తు మీద అభ్యర్థులను నిలబెడతామని ధైర్యంగా చెప్పండి.

ఆ తేడా తెలియని బాబు:
    చంద్రబాబుకు వినోదం.. విషాదం మధ్య తేడా కూడా తెలియదు. ఆయనకే కాదు, ఆయన కొడుక్కు కూడా తెలియదు. జయంతి, వర్థంతి మధ్య తేడా ఏమిటో లోకేష్‌కు తెలియదు. ఇక చంద్రబాబు, ఏకంగా గుడ్‌ఫ్రైడేకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అంటే ఆయనకు వినోదం.. విషాదం మధ్య తేడా ఏమిటన్నది తెలియదన్న విషయం అర్ధమవుతోంది.
    ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా పిచ్చి విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

Back to Top