ఏది అడిగినా వైయస్‌ జగన్‌ కాదు అనరు

నాన్‌ ఫిషర్‌ మెన్‌ ప్యాకేజీకి సీఎం వైయస్‌ జగన్‌ క్లియరెన్స్‌ ఇచ్చారు

తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.25 వేల సాయం

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నేలటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏది అడిగినా కూడా కాదు..లేదు అనరని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.  నాన్‌ ఫిషర్‌ మెన్‌ ప్యాకేజీకి సీఎం వైయస్‌ జగన్‌ క్లియరెన్స్‌ ఇచ్చారని, తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.25 వేల సాయం అందజేస్తామని చెప్పారు. నేలటూరులో దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ కేంద్రం ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు.   

అందరికీ నమస్కారం, ఈ రోజు నిజంగా ఒక చారిత్రాత్మక నేపధ్యం, థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ మూడో యూనిట్‌ ఈ రోజు జాతికి అంకితం చేయడం మనమంతా గర్వించాల్సిన విషయం. అనేక సందర్భాలలో ఈ ప్రాంతానికి నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజి కోసం ప్రతి ఎన్నికలలో వాగ్ధానం చేయడం, అమలుచేయకపోవడం జరిగింది. చంద్రబాబుకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది, ప్రజలకు మూడు నామాలు పెడతాడు కాబట్టి ఏదైనా మూడు విడతలు అంటారు. ఎన్నికల ముందు మూడు విడతల్లో ప్యాకేజి అని చంద్రబాబు 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తాం, వైఎస్‌ఆర్‌సీపీ వారిని పక్కనపెట్టండి అని వారికి కూడా ఇవ్వలేదు. మేం అధికారంలోకి రాగానే మీరు ఎదురుచూస్తున్న నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజ్‌ తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇస్తామన్నాం, కేవలం 7 పంచాయతీలు ఎంపిక చేస్తే 20 పంచాయతీలు, పోర్టుకు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ ఇస్తామని చెప్పినట్లుగానే, సీఎంగారి చేతుల మీదుగా రూ. 36 కోట్ల నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజి ఇస్తున్నాం. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగింది, మిని ఫిషింగ్‌ హార్బర్‌ వెళ్ళిపోతే ఈ ప్రాంత మత్స్యకారుల గురించి ఆలోచించి రూ. 25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టీకి సీఎంగారు శంకుస్ధాపన చేశారు. ఏది అడిగినా కాదనకుండా, ఏది కావాలన్నా లేదు అనని సీఎం మన రాష్ట్రానికి ఉండటం మనకు గర్వకారణం. అదే స్ధానంలో శ్రీ జగన్‌ గారు కాకుండా మరే సీఎం ఉన్నా నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజ్‌ కానీ ఫిషింగ్‌ జెట్టీ కానీ వచ్చే పరిస్ధితి ఉండేది కాదు. చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను అధికారంలోకి వస్తే అధునాతనమైన బాంబులతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పేల్చేస్తాను, వాటి వల్ల కాలుష్యం పెరుగుతుందన్నాడు, కానీ 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుంటే బాంబులతో పేల్చేయడానికి వస్తున్నాడనుకుంటే కానీ ఆయన నిసిగ్గుగా అన్నింటికీ రిబ్బన్‌ కత్తిరించి నేను సర్‌ప్లస్‌ విద్యుత్‌ ఇస్తున్నానని నిర్లజ్జగా ప్రకటించుకున్నాడు. వాస్తవానికి ఏ ఒక్కటి కూడా అడగాలని లేకపోయినా ఈ రోజు మాత్రం ఇది అడగకతప్పలేదు. ఇక్కడ ఉప్పుకాలవ మీద బ్రిడ్జి రూ. 12 కోట్లు అవుతుంది, అది మంజూరు చేయమని అడుగుతున్నాం, దీంతోపాటు కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ. 9.40 కోట్లు బ్రిడ్జి... రెండు కలిపి రూ. 21.40 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే గ్రామాలకు అవసరమైన అనేక నిధులు మంజూరు చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీ పక్షాన నిలబడినందుకు వారికి ధన్యవాదాలు. మా ప్రాంత ప్రజలు మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్న కోరిక నెరవేరేలా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Back to Top