బలహీనపక్షాల తరఫున నిలబడే బలమైన నేత సీఎం వైయ‌స్‌ జగన్‌

  మంత్రి జోగి రమేష్‌

 పెడన: బలహీనుల పక్షాన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని..ఎవరూ మరచిపోవద్దని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. పేదవారి పక్షాన జగనన్న నిలిచారని గుర్తు చేశారు. పెడన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం నాలుగో విడత కార్యక్రమంలో మంత్రి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

ఈ నియోజకవర్గానికి ఈ రోజు పండుగ వచ్చింది, జగనన్న వచ్చారు పండుగ తెచ్చారు. అన్నా ఇది మంచి సందర్భం, నేతన్నలకు తోడుగా, బాసటగా, బడుగు వర్గాలకు అండగా నేనుంటానని మీరు పాదయాత్రలో చెప్పారు, మీరు సీఎం అయిన వెంటనే నేతన్నలకు అండగా నేతన్న నేస్తం కార్యక్రమం ప్రకటించి వారి పట్ల మీ హృదయంలో ఎంత పెద్ద స్ధానముందో చెప్పకనే చెప్పారు, ఈ రోజు మా పెడన పట్టణానికి రావడం గర్వకారణం, మాది పేద నియోజకవర్గం, కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఉన్నాం, మా దేవుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు పెడన వెళ్ళమన్నారు, ఇక్కడి ప్రజలు ఆశీర్వదించడంతో నేను ఎమ్మెల్యేనయ్యాను, చిన్నగొల్లపాలెంలో బ్రిడ్జి కడతామంటే ఎవరూ నమ్మలేదు, కానీ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గారు రెండు బ్రిడ్జిలు కట్టించారు, కృతివెన్ను మండలంలో ఉప్పునీటి సమస్యను తీర్చడానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గారు మెగావాటర్‌ స్కీమ్‌తో వారి దాహార్తిని తీర్చారు, కృష్ణా డెల్టా ఆధునీకరణ చేసి చివరి భూముల వరకూ కూడా నీళ్ళు పారించిన మహనీయుడు ఆయన, తర్వాత చంద్రబాబు పాలనలో ఎడారిలా మారింది, మీ హయాంలో మళ్ళీ రెండు పంటలు పండిస్తున్నారు, మా దేవుడు వైఎస్‌ఆర్‌ గారు నన్ను ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు మీరు నన్ను మంత్రిని చేశారు. మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను, మీ సైనికుడిగా ఊపిరి ఉన్నంతవరకూ మీ వెంటే ఉంటానన్నా, ఈ రోజు గడప గడపకూ వెళ్తున్నప్పుడు అందరూ ఒకటే చెబుతున్నారు, నాడు జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన మేం ఆయన వెంటే నడుస్తాం అంటుంటే సంతోషంగా ఉంది. గతంలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక కుర్రాడు ఇప్పుడు నాతో పనిచేస్తున్నాడు, నేను ఎందుకు నాతో తిరుగుతున్నావని అడిగితే కులం కూడు పెట్టదు అన్నా, మనసున్నవాడే కడుపునిండా అన్నం పెడతాడన్నాడు, మా అమ్మకు కాపునేస్తం వస్తుంది, నా భార్యకు అమ్మ ఒడి వస్తుంది, నాకు ఇంటి పట్టా వచ్చింది, కులాలు కూడుపెట్టవు, జగనన్నే ప్రేమను పంచుతాడని ఆ కుర్రాడు అంటే నాకు మాట రాలేదు, ఇంతమంది జగనన్నను చూడాలని, అన్న మాట వినాలని, అన్న కోసం ఎందాకైనా ఉంటామని స్వాగతం పలుకుతుంటే ఆనందంగా ఉంది. గతంలో బీసీలకు చిన్న చిన్న పరికరాలు ఇచ్చి సరిపెడితే ప్రతి ఇంటికి కూడా ఈ రోజు జగనన్న లైఫ్‌ ఇస్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పథకాలు ఇస్తున్న మనసున్న మనిషి మన జగనన్న, మనం ఏం అడగకుండానే మనకు ఇన్ని చేస్తున్నారు, పేదల పక్షాన అన్న ఉన్నారు, మీకు మా నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు. 

గుడివాడ అమర్‌నాథ్, చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి

ఈ రోజు నాలుగో విడత నేతన్న నేస్తం ద్వారా నేతన్నలకు సాయం చేస్తున్నాం, ప్రతి ఏటా రూ. 24 వేలు ఈ పథకం క్రింద అందిస్తున్నాం, సీఎంగారు తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నేతన్నలకు అండగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో మరింతగా అండగా ఉండి నేతన్నలను ఆదుకుంటాం, ఈ–కామర్స్‌ ద్వారా ఆప్కో ద్వారా రూ. 100 కోట్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుంది. చేనేత కార్మికులకు సీఎంగారు అండగా నిలబడతారు, మీరు కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

సత్యాకుమారి, లబ్ధిదారు, బ్రహ్మపురం, పెడన 

అందరికీ నమస్కారం, నేను గత 15 సంవత్సరాలుగా చేనేత వృత్తిలో ఉన్నాను, మా నేత కార్మికులకు ఒక ప్రత్యేకత ఉంది, శ్రీశైల మల్లిఖార్జునుడికి మేం పాగా నేసి ఆ పాగాని మేమే స్వయంగా స్వామికి సమర్పించే కుటుంబంలో జన్మించినందుకు సంతోషంగా ఉంది, అలాగే అమ్మవారి ఉత్సవాలు కూడా మా నేతన్న చీరలు ఇచ్చాకే జరిపేవారు, కానీ మా నేతన్నల కుటుంబాల పోషణ భారమైంది, వర్షాకాలం వస్తే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, జగనన్నా మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీ పుట్టినరోజు నాడే డిసెంబర్‌ 21న ఈ పథకం ప్రవేశపెట్టి నేరుగా రూ. 24 వేలు మా బ్యాంకు ఖాతాలో జమ చేశారు, మేం కలలో కూడా ఊహించలేదు, కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం, అప్పుడు కూడా మీరు సాయం చేశారు, మీరు మా కుటుంబ భారాన్ని తగ్గించి, మాకు ధైర్యాన్నిచ్చారు. మాకు సచివాలయ వ్యవస్ధ దగ్గరలో రావడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉన్నాయి, వలంటీర్లు కూడా చాలా సహాయం చేస్తున్నారు, నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు చదువుతున్న స్కూల్స్‌ నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చేశారు, నాకు అమ్మ ఒడి అందుతుంది, డ్వాక్రా సంఘంలో సున్నా వడ్డీ కూడా అందింది. మా ఊరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మా చేనేత కార్మికుల తరపున మీకు ధన్యవాదాలు, మాకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, చేనేత కార్మికులకు గుర్తింపు వచ్చేలా చేయాలని, అది మీ వల్లే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను, ధన్యవాదాలు.

కొసరం వాసు, లబ్ధిదారుడు, పోలవరం గ్రామం, గూడూరు మండలం

జగనన్నా నేను గత 20 సంవత్సరాలుగా చేనేత వృత్తి మీదే జీవనం కొనసాగిస్తున్నాను. మీరు మా నేతన్నల కష్టాలు గమనించి మాకు ఈ పథకం అమలుచేస్తున్నారు, మీకు రుణపడి ఉంటాం, మాకు వర్షాకాలంలో పని చేసుకోవడం కుదిరేది కాదు, కానీ మీరు చేస్తున్న సాయంతో మా మగ్గాలు ఆధునీకరించుకోవడంతో పాటు వృత్తి నైపుణ్యం పెంచుకున్నాం, మేం సంతోషంగా జీవిస్తున్నాం, నాకు ఇద్దరు పిల్లలు, అమ్మ ఒడి వచ్చింది, విద్యాకానుక కిట్లు వచ్చాయి, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరించి అందని ద్రాక్షలాంటి ఇంగ్లీష్‌ మీడియంను మాలాంటి పేదలకు చేరువ చేశారు, నవరత్నాల పేరుతో ఇన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్న మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

తాజా వీడియోలు

Back to Top