గుడివాడ గడ్డ..కొడాలి నాని అడ్డా

మంత్రి జోగి రమేష్‌
 

విజయవాడ: గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.వైయ‌స్ జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. వైయ‌స్ జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది . డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?.  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం. అనంత‌రం మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ..గుడివాడకు ఒక బ్రాండ్‌ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అన్నారు. గుడివాడలో టీడీపీ నుంచి నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top