తాడేపల్లి: కుప్పం, టెక్కలిలో ఎక్కడైనా సరే.. మేనిఫెస్టో హామీలపై చర్చిద్దామని మంత్రి జోగి రమేష్ చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు సవాలు విసిరారు. టైమ్, ప్లేస్ మీరే చెప్పండి...తప్పించుకోవద్దు. పార్టీ లేదు..బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు బొక్క పార్టీకి ఏపీ అధ్యక్షుడు. ఆ బొక్క పార్టీకే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఇవాళ అచ్చెన్నాయుడు లెఫ్ట్ గాళ్లను, రైట్ గాళ్లను కూర్చోబెట్టుకుని వాస్తవ పత్రాన్ని విడుదల చేశాడట. మీరు విడుదల చేసిన పుస్తకానికి... ప్రకాశిస్తున్న నవరత్నాలు...పారిపోతున్న చంద్రబాబు అని ట్యాగ్ పెట్టుకుంటే సూటవుతుంది. చాలా వీరంగం వేసి చాలెంజ్ విసిరాడు...ముఖ్యమంత్రిగారినే చర్చకు రమ్మన్నాడు. లేదా క్యాబినెట్‌ను రమ్మన్నాడు... వచ్చాం రండిరా బాబు.. మీ సవాలును మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాం. అచ్చెన్నాయుడుకి చీము, నెత్తురు ఉంటే..ధైర్యం, దమ్ము ఉంటే కుప్పం, టెక్కలిలో మీరు ఎంచుకున్న గ్రామంలో చర్చిద్దాం.. ఛాలెంజ్. 2014 నుంచి 2019 వరకూ మీ టీడీపీ ప్రభుత్వంలో ఆ గ్రామాల్లో అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాలు తీద్దాం. మీ హయాంలో ఆ అక్క చెల్లెమ్మలకు మీరు ఏమిచ్చారో చూద్దాం... 2019 నుంచి ఇప్పటి వరకూ జగన్ గారు ఏమిచ్చారో చూద్దాం... ఒక గ్రామాన్ని కొలమానంగా తీసుకుందాం...ఆ గ్రామానికి మీ చంద్రబాబు పరిపాలనలో ఏం మేలు జరిగిందో చూద్దాం. ఈ నాలుగేళ్లలో మా పరిపాలనలో, ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఆ గ్రామానికి ఏం మేలు జరిగిందో బేరీజు వేద్దాం. చాలెంజ్ చేశారు కదా... మాట తప్ప వద్దు...మడమ తిప్ప వద్దు... టైం చెప్పండి...ఏ రోజు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాం. కుప్పం వెళ్దామా..టెక్కలి వెళ్దామా..పాత్రికేయ మిత్రుల ద్వారా సమయం, గ్రామం చెప్పండి. ఈ ఛాలెంజ్‌కి సమాధానం చెప్పమని అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. అసలు మీ మేనిఫెస్టోలో ఏముందో మీకన్నా తెలుసా..?: 1995 నుంచి 2004 వరకూ, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకూ మీ మేనిఫెస్టో ఏముందో మీకన్నా తెలుసా..? 2014–19 మధ్య ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడుందో మీకు కూడా తెలియదు... ఆఖరికి దాన్ని మీ వెబ్‌సైట్ నుంచే తీసేశారు. మాతోనే చర్చకు రావడానికి మీది గుండే.. చెరువా..? ఎంత ధైర్యం మీకు..? కావాలంటే, కుప్పం, టెక్కలి కూడా వదిలేయండి...అసెంబ్లీకి రండి...చర్చిద్దాం. వచ్చేటప్పుడు మీ స్వాతిముత్యాన్ని కూడా వెంటపెట్టుకుని తీసుకురా అచ్చెన్నాయుడు.. ప్రజలు మీకు ఒక వేదిక ఇచ్చారు...ఆ వేదిక వద్దకు రండి...అన్నీ తేల్చుకుందాం. ఆ వేదిక మీద చర్చ జరిగితే చిత్తుచిత్తుగా ఓడిపోయి.. మేం కొట్టే వాస్తవాల దెబ్బలకు జుట్టు పీక్కొని పారిపోతారు. దమ్ముంటే ఈ చాలెంజ్‌ను కూడా స్వీకరించమని అడుగుతున్నా. ఒళ్లు పెంచడం కాదు బుర్ర పెంచుకో అచ్చెన్నాయుడు. నువ్వు మా అన్న జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో గురించి, నవరత్నాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విలువలు, విశ్వసనీయత లేని మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హతే లేదు. నాలుగేళ్లలో 99 శాతం హామీల అమలు చేసిన ప్రభుత్వం మాది: దేశ చరిత్రలో కేవలం నాలుగేళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం నెరవేర్చిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీనే. మూడేళ్ల కాలంలోనే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గడప గడపకి పంపించి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ధైర్యం, దమ్ముగా అడుగుతున్న ప్రభుత్వం మాది. చరిత్ర పుటల్లో చూసుకోండి...ఏ ఎమ్మెల్యే అయినా ఇలా గడప గడపకు వెళ్లిన దాఖలాలు లేవు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనలో మాత్రమే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి గడప వద్దకు వెళ్తున్నాడు. పథకాలు వచ్చాయా..లేదా..రాకపోతే అరకొర మిగిలిపోతే జగనన్న సురక్ష పథకం ద్వారా వారికీ అందించేందుకు సంసిద్ధమైన ప్రభుత్వం మాది. మీరు మా మేనిఫెస్టో గురించి మాట్లాడటానికి అర్హులేనా..? రాష్ట్రంలోని 44 లక్షల మంది తల్లుల వద్దకు వెళ్లి అమ్మ ఒడి గురించి అడుగుదాం.. ఫించన్లు అందుకుంటున్న 64 లక్షల మంది అవ్వా తాతల వద్దకు వెళ్దాం. మీ దిక్కు మాలిన ప్రభుత్వంలో40లక్షల పెన్షన్లు ఇచ్చి, పైగా అబద్ధాలు చెప్పుకుంటున్నారు. మనసున్న ప్రభుత్వం, పేదవాడిని చేయిపట్టి నడిపిస్తున్న ప్రభుత్వం మాది. 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా, రైతులకు అండగా రైతు భరోసా అందిస్తున్నాం. 26 లక్షల మందికి చేయూత అందిస్తున్నాం. ఇలాంటి పథకాలు పెట్టాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? పిల్లల్ని చదివించాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా..? 1వ తేదీనే తెల్లవారకముందే పింఛన్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని అబద్దపు హామీలిచ్చిన మీరా మా మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారా..? ప్రజలు చెంపచెళ్ళుమనిపించినా మీకు బుద్ధిరాలేదు: - మీ మోసపు వాగ్దానాలు చూపి... మీ చెంప చెళ్ళుమనిపించి అక్క చెల్లెమ్మలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. - రైతుని రారాజును చేయడం కోసం జగన్ గారు పరితపిస్తున్నారు. - ఆనాడు రైతులంతా మిమ్మల్ని చావబాది 23 సీట్లకే పరిమితం చేశారు. - సిగ్గు లేకుండా మీరు కూడా మాట్లాడుతున్నారా..? - మేనిఫెస్టో–1 విడుదల చేశారట..గ్రామాల్లో దాన్ని చించి మీ ముఖానే కొడుతున్నారు. - అలాంటి మీరు మా మేనిఫెస్టోపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. - నవరత్నాల గురించి మీకు తెలియదు..మీరు బుర్రతక్కువ వెధవలు. - జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకాశించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కోరుకుంటున్నాయి. - ఇక్కడ అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు చూసి, చాలా పార్టీలూ జగన్ గారిని అనుసరిస్తున్నాయి... - మాట ఇస్తాడు...చేసి చూపిస్తాడు జగన్ గారు...అందుకే ప్రజలు ఆయన్ని నమ్మారు... - మీలాంటి చవటలు, సన్నాసులు చెప్పింది వినే పరిస్థితిలో ప్రజలు లేరు. - పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు ఈ రోజు మనసులో ఉన్న మరో మాట చెప్పాడు. - సిగ్గు మాలిన వాడు చంద్రబాబునాయుడు అని మనసులో మాటను చెప్పేశాడు. - మీతో చర్చకు ముఖ్యమంత్రి గారు రావాలా..? మేము రావడమే ఎక్కువ. - 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం...21 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. - దీన్ని కూడా ఓర్చుకోలేక పేదవాడికి ఇళ్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చిన మీకు, మా గురించి మాట్లాడే అర్హత లేదు. - మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా... ఎంత పొర్లాడినా 2024లో చింతకాయ పచ్చడిలా కొట్టిపడేస్తారు. ప్రశ్నలు–సమాధానాలు: - మేం జీపీఎస్ తీసుకొచ్చాం..ఉద్యోగులంతా ఆమోదించారు. - దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి స్కీంను మన రాష్ట్రంలో తీసుకొచ్చారని ఉద్యోగులే చెప్తున్నారు. - ఆనాడు నేను చంద్రబాబును కలవడానికి కరకట్ట కొంప వద్దకు వెళ్తేనే పారిపోయాడు. - చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎలాగూ చర్చకు రాలేరు..వారు ప్రెస్ మీట్‌లకు మాత్రమే పరిమితం. - నోరుంది కదా అని రోడ్లెక్కి తిట్టడానికి మాత్రమే వాళ్లు పనికి వస్తారు. - వాళ్లు గెలిచిన కుప్పం, టెక్కలిలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకోమని చెప్తున్నాం. - దొంగ ఓట్లతో గెలిస్తే...కుప్పంలో గెలిచేవాళ్లం కదా..? - ఆడలేక మద్దెల దరువు అన్నట్లు గెలవలేక ఈ మాటలన్నీ చెప్తున్నారు. - టీడీపీ వారికి గన్ లైసెన్స్ ఇస్తే డెరెక్ట్‌గా వెళ్లి చంద్రబాబును కాలుస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను చంపింది ఆయనే కదా..? త్వరలోనే ఆర్5 జోన్‌లో జై జగన్ అంటూ గృహప్రవేశాలు: - పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు..పేదలు పేదలుగానే ఉండాలనేది చంద్రబాబు అండ్ కో.. ఆలోచన. - ఒక మనసున్న లీడర్‌గా జగన్ గారు పేదలకు అండగా ఉంటే, అమరావతి ప్రాంతంలో ఆర్5 జోన్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. - వందకు వంద శాతం అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరిగి తీరుతాయి. - 50 వేల ఇళ్ల నిర్మాణం జరిగి... అక్క చెల్లెమ్మలు జై జగన్ అంటూ గృహప్రవేశాలు కూడా త్వరలోనే జరుగుతాయి. - శిఖండులు, రాక్షసులు ఎంత మంది అడ్డుపడినా దేవుని దీవెనలు జగన్ గారికి ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు.