భారీ మెజార్టీతో విక్రమ్‌రెడ్డి విజయం సాధిస్తారు

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో పూర్తివిశ్వాసం

బుద్ధీజ్ఞానం ఉన్నాడో ఎవరైనా అయ్యన్న భూకబ్జాకు సపోర్టు చేస్తాడా..?

చలో నర్సీపట్నం అంటూ చంద్రబాబు డ్రామాలు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ధ్వజం

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక వచ్చిందని, ప్రజలంతా విక్రమ్‌రెడ్డిని ఆదరిస్తున్నారన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి తరఫున మంత్రి జోగి రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. 

అనంతరం మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వం పట్ల ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఫ్యాన్‌ గుర్తుకు వన్‌సైడ్‌గా ఓటు వేస్తామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతీ గడపకూ అందుతున్నాయని, సంక్షేమ పథకాల రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన అంశమన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు.  

బీసీ అయితే.. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారా..?
బుద్ధీజ్ఞానం ఉన్నాడో ఎవరైనా అయ్యన్నపాత్రుడి భూకబ్జాకు సపోర్టు చేస్తాడా అని మంత్రి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. చలో నర్సీపట్నం అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని, అయ్యన్నపాత్రుడు బీసీ అయితే.. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన అయ్యన్నను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడని, ప్రభుత్వం మీద బురదజల్లాలి.. సీఎం వైయస్‌ జగన్‌పై అసత్య ప్రచారం చేయాలనే చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top