కేబినెట్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నా

ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
 

అమరావతి: పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం తీసుకురావడం దేశంలోనే మొదటిసారి అని, కేబినెట్‌లో నేను భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని ఐటీ శాఖ మంత్రి  మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అసెంబ్లీలో మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీలు తగ్గించడంతో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని, దీంతో 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కియా మోటర్స్‌లో మనవాళ్లంతా వాచ్‌మన్‌లుగా, గార్డినర్లుగా, హౌస్‌కీపింగ్‌లలో పనిచేస్తున్నారని, కానీ అదే వాచ్‌మన్‌కు మంచి ట్రైనింగ్‌ ఇస్తే అదే పరిశ్రమల్లో ఉద్యోగిగా ఉంటాడనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. 30 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దగ్గరగా చూస్తున్నానని, చాలా బాధ్యతాయుతంగా ఉంటారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top