బాబు, పవన్‌లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్‌షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్‌షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల
15 Sep 2021 12:04 PM
విజయవాడ: ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.