అమ్మ ఒడి పథకం సీఎం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో ప్రవేశపెట్టారు

మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: అమ్మ ఒడి పథకం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దూరదృష్టితో వచ్చిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్టరలో విద్యకు సీఎం వైయస్‌ జగన్‌ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పేద పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆశయమన్నారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...

ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూశాఖ మంత్రి

అందరికీ నమస్కారం, అమ్మ ఒడి పథకం ఏదో ఆషామాషీగా ప్రవేశపెట్టిన పథకం కాదు, దూరదృష్టితో ముఖ్యమంత్రిగారు చేసిన ఆలోచన ఇది. ఒక సాధారణ కుటుంబంలో తన పిల్లవాడు కూడా బాగా చదువుకుని సమాజంలో గౌరవం పొందాలని, మంచి సంపాదనాపరుడవ్వాలని కలలు కనే లక్షలాది కుటుంబాలు గడిచిన 75 ఏళ్ళుగా ఇలాంటి సదుపాయం కోసం ఎదురుచూశాయి, కానీ నెరవేరలేదు. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఇలాంటి విషయాలను స్పష్టంగా పేర్కొన్నా కూడా గడిచిన కాలంలో ఉన్న పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ మన రాష్ట్రంలో అంత ప్రాధాన్యతనివ్వలేదు. దానికి నిదర్శనమే ఇంత సంపన్నమైన రాష్ట్రం దేశ పటంలో అక్షరాస్యతలో 22 వ స్ధానం లో ఉండడానికి కారణం. ఇదే దక్షిణభారతంలో ఉన్న కేరళ మొదటి స్ధానంలో ఉంది, మరి ఏపీ 22 వ స్ధానంలో ఎందుకుందని మనం ఆలోచించాలి. 75 సంవత్సరాల క్రితమే శ్రీ జగన్‌ లాంటి ఒక ముఖ్యమంత్రి ఈ ఏపీకి వచ్చి ఉంటే ఏపీలో ఉన్న విద్యార్ధుల స్థితి, తల్లిదండ్రుల స్ధితి, జీవనప్రమాణాలు ఇలా ఉండేవా, ఈ వేళ ఇచ్చిన ప్రాధాన్యత ఒక 50, 60 ఏళ్ళ క్రితమే ఇచ్చి ఉంటే ప్రతి కుటుంబం తాలూకూ జీవన ప్రమాణాలు అత్యున్నత స్ధాయికి పెరిగి ఉండేవి. ప్రతిపక్షం, కొంతమంది అవగాహన లేని వారు ఇది డబ్బులు పంచే కార్యక్రమం అంటున్నారు, కాదని నేను చెప్తున్నా, సంపన్న వర్గాలు కూడా సరిగ్గా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలకు 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా అని అడుగుతున్నా. ఇది ఆలోచించే ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ ఎన్నికైన వెంటనే విద్యకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య వరకూ అన్ని రకాలుగా టై అప్‌ చేసి తన పిల్లవాడు కూడా ఈ సమాజంలో ధనవంతుల పిల్లలు చుదువుకున్నట్లుగానే చదువుకునే అవకాశం కల్పించారు. ఇది చిన్న ఆలోచన కాదు, కేవలం ఎన్నికల ముందు పంచిన డబ్బు కాదు, ఇది మూడో విడత, ఈ రోజు రాష్ట్రంలోని పేదలకు అందరికీ అందుతుంది. ఇదే లేకపోతే తన పిల్లవాడిని ఆకలి కోసం కార్మికులుగా పంపాల్సిన పరిస్ధితి ఉండేది. ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్ధితులు కొనసాగడం మంచిదా అని అడుగుతున్నా, అందుకే ఇవాళ శ్రీ జగన్‌ గారు తీసుకున్న నిర్ణయం ఒకప్పుడే తీసుకుని ఉంటే పరిస్ధితులు భిన్నంగా ఉండేవి. సంపన్నులు కానీ ప్రతిపక్షం కానీ ఈ పథకాలని విమర్శించడం సరికాదు, ఇంతవరకు చేసిందే తప్పిదాలు, ఇప్పుడు సరైన దిశలో ఒక నాయకుడు ఆలోచించి ముందుకెళుతుంటే ఇలాంటి విషయాలను మీరు ప్రత్యక్షంగా మాట్లాడకుండా పత్రికలలో రాయించడం ఎంతమాత్రం సహించరాదు. సమసమాజం ఏర్పడడానికి తీసుకున్న నిర్ణయాలకు మీరు వ్యతిరేకంగా చేస్తున్న పనిగా భావించాలి. దీనిని సంపన్నులు కూడా ఆర్ధం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనకబడిన జిల్లా, మీ తండ్రి గారి హయాంలో ఈ జిల్లా అభివృద్దికి చాలా కృషిచేశారు. మాకు వనరులు ఉన్నా అన్నీ ఉన్నా కానీ సరిగా పాలకులు సరిగా దృష్టిపెట్టకపోవడం వల్ల ఒక్క వైఎస్‌ఆర్‌ హయాంలో తప్ప సరైన న్యాయం జరగలేదు. ఆ ఆవేదన జిల్లా ప్రజలందరిదీ, మీరు వచ్చారు వచ్చిన వెంటనే ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నీటి ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేశారు. చంద్రబాబు, జనసేన నాయకుడు చూశారు కానీ ఏం చేశారు. ఈ వేళ అక్కడి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, 75 ఏళ్ళ కల శ్రీ జగన్‌ గారి వల్ల నెరవేరిందని, ఇది నిజం కాదా, అలాగే కిడ్నీ వ్యాధుల నివారణకు అనేక ప్రకటనలు చేశారు, కానీ చర్యలేవి, మీరు వచ్చిన తర్వాత అక్కడ శాశ్వత పరిష్కారం కోసం రూ. 200 కోట్లతో ఆసుపత్రిని కట్టడం కోసం, డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేసి రోగులకు డబ్బు ఇచ్చి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఇది ఎన్నికల కోసం కాదు కదా, మా జిల్లా ప్రజలంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మా అందరికీ ప్రాణప్రదమైన వంశధార ప్రాజెక్ట్‌ ద్వారా 6 నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయి. రెండో పంట వస్తుంది. మీరు తీసుకున్న చర్యల వల్ల నేరడి బ్యారేజ్‌ అడ్డంకులు తొలిగాయి, అది ముందుకు నడుస్తుంది. దానిలోపే రూ. 2,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్ట్‌ వినియోగం తీసుకురావడానికి ఒక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఇవ్వమని మీకు విజ్ఞప్తి చేశాం, ప్రజలందరి తరపునా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, దానివల్ల వచ్చే ఏడాది వేసవిలో 2.50 లక్షల ఎకరాల ఆయుకట్టుకు రెండో పంటకు నీరిచ్చే అవకాశం మాకు రాబోతుంది. ఈ స్టేడియం (కోడి రామ్మూర్తి స్టేడియం) జిల్లాలో ఉండే అధికారిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఉండే ఏకైక స్టేడియం ఇది. టీడీపీ వారు దీనిని పడగొట్టి పట్టించుకోకుండా వదిలేశారు. ఈ వేళ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు, వాకర్స్‌ అంతా మీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మీ చేతుల మీదుగా రూ. 10 కోట్లు ఇస్తే ఈ స్టేడియం పూర్తి చేసి మీ చేతుల మీదుగా మార్చిలో ప్రారంభించడానికి సిద్దం చేస్తాం. అలాగే టెక్కలి ప్రాంతంలో మహేంద్ర తనయకు మీ తండ్రిగారు ఫౌండేషన్‌ స్టోన్‌ వేశారు, అది కరువు ప్రాంతం, ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ రూ. 855 కోట్లు మీకు పంపాం, అది మీ చేతుల మీదుగా పూర్తి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఆముదాలవలసను కలిపే రోడ్డు ఒకటి శాంక్షన్‌ అయింది, కానీ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు, దానికి అవసరమైన రూ. 18 కోట్లు ఇస్తే నిర్వాసితులను ఆదుకున్నవారు అవుతారు. మీరు చేస్తున్న పాలనా పద్దతి ఒక వంద సంవత్సరాలకు ముందుకు ఆలోచించి చేస్తున్నారు. ఏ రాజనీతిజ్ఞుడైనా ఇది చేయాలి. మీరు చేస్తున్న పనులను చిరకాలం గుర్తించుకుంటారు. మా జిల్లా ప్రజల తరపున మీకు నిరంతరం అండగా ఉండి మా జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించడంపై మీకు మరొక్కసారి కృతజ్ఞతలు. 

బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

అందరికీ నమస్కారం, చాలా సంతోషంగా ఉంది, మూడో విడత అమ్మ ఒడి కార్యక్రమంలో ఈ రోజు సీఎం గారు ఆయన చేతుల మీదుగా రూ. 6,500 కోట్లు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. ఇది ఒక అద్భుతం, ఎందుకంటే గతంలో నాయకులు మాటలు చెప్పేవారు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, శ్రీ జగన్‌ గారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, తన తండ్రిగారి స్పూర్తితో విద్యకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. విద్య కోసం వివిధ పథకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 52 వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చుచేసింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున విద్యకు ఇంత ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు లేవు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలో నిరక్షరాస్యులు ఉండకూడదని, అందరూ చదువుకోవాలని, విద్య కోసం పెడుతున్న ఖర్చు ఇది సంక్షేమం కోసం కాదు రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడి అని ఆలోచించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న బాష, ఆలోచనలు చూస్తే ఆయన నేను రాష్ట్రానికి ఇది చేశాను అది చేశాను, నా పాలనకు శ్రీ జగన్‌ గారి పాలనకు వ్యత్యాసం చూడమని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు, ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక చాలెంజ్‌గా, ధీర్ఘకాలిక ప్రణాళికతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. తన సుధీర్ఘమైన పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట మేరకు ఇచ్చిన హామీలు 95 శాతం అమలుచేశామని ఆయన మంత్రివర్గ సభ్యుడిగా గర్వంగా చెబుతున్నా, ఇదీ పాలన అంటే, ఇదీ ఆలోచన అంటే...మాట ఇచ్చాం కదా ఎన్నికలప్పుడు పసుపు, కుంకుమ, లేకపోతే మరేదో ఇద్దామనుకునే రకం కాదు, రాజకీయం అంటే ఒక అర్ధం ఉండాలి, నాయకుడంటే విలువలతో కూడిన సాంప్రదాయాలు ఉండాలి, మాట ఇస్తే నెరవేర్చాలి అని రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకొచ్చారు శ్రీ జగన్‌ గారు. అమ్మ ఒడి పథకంపై కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు ఊకదంపుడు కబుర్లు చెప్పాయి, కానీ ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి తెలుసు, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మాట ఇస్తే అమలుచేసే ప్రభుత్వమిది. ఈ కార్యక్రమంలో భాగస్వామినైనందుకు నేను విద్యాశాఖ మంత్రిగా గర్వంగా భావిస్తున్నాను. థ్యాంక్యూ. 

జి.నిహారిక, విద్యార్ధిని, 9 వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం

అందరికీ శుభోదయం, నేను మిమ్మల్ని జగన్‌ మామయ్య అని పిలవాలని అనుకుంటున్నాను. జగన్‌ మామయ్యకు మా విద్యార్ధుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా విద్యార్ధుల కోసం జగన్‌ మామయ్య ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి ఇది అద్భుతమైన పథకం, రూ. 15 వేలు నేరుగా మా అమ్మ అకౌంట్‌లో వేస్తున్నారు, ఇందులో ఎలాంటి అవినీతి లేదు, నా భవిష్యత్‌ చదువుల కోసం ఈ డబ్బు దాచుకున్నాను. జగనన్న విద్యాకానుకలో మంచి నాణ్యమైన యూనిఫాం, షూస్, సాక్స్‌ ఇలా ప్రతీది చక్కగా ఉన్నాయి, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ చాలా బావుంది. జగనన్న గోరుముద్ద లో చక్కటి పౌష్టికాహారం ఇస్తున్నారు, గతంలో ఇలా ఉండేది కాదు, నేను ఇంటి నుంచి బాక్స్‌ తెచ్చుకుని తినేదానిని, కానీ జగన్‌ మామయ్య పెడుతున్న భోజనం చాలా బావుండడంతో, రుచికరంగా ఉండడంతో నేను చాలా సంతోషంగా ఇక్కడే తింటున్నాను. మన బడి నాడు నేడు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. గతంలో మా స్కూల్‌లో టాయిలెట్స్‌ లేవు కానీ ఇప్పుడు చక్కటి టాయిలెట్స్, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ క్లాస్‌ రూమ్స్, గోడలపై చక్కటి చిత్రాలు, మంచి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌బోర్డ్‌ అన్నీ ఉన్నాయి. మీరు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం అనేది విప్లవాత్మక నిర్ణయం. జగన్‌ మామయ్య వల్ల నేను ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాను. దిశ యాప్‌ వల్ల మహిళలు అంతా తమ సోదరుడు ఉన్నారన్న ధైర్యంతో ఒంటరిగా వెళ్ళగలుగుతున్నారు. నేను పాదయాత్రలో మిమ్మల్ని చూశాను, నాకు అప్పుడు కన్నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నిజమైన నాయకుడు. జగన్‌ మామయ్య మీరు రాజన్నకు పుత్రుడు, రైతన్నకు మిత్రుడు, అక్కచెల్లెల్లకు అన్నతమ్ముడు, మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు, ఇంతకంటే ఇంకేం చెప్పలేను, ధ్యాంక్యూ సార్‌. 

కే. రవణమ్మ, విద్యార్ధి తల్లి, జొన్నలపాడు, రామచంద్రాపురం

అందరికీ నమస్కారం, ఈ రోజు మాకు పండుగ వాతావరణం, నవరత్నాలలో భాగమైన అమ్మ ఒడి మా జిల్లాలో ప్రారంభించినందుకు మా తల్లుల తరపున, మా జిల్లా తరపున మీకు అభినందనలు. పిల్లలకు అమ్మ ఒడి సరిపోదు ఇంకా కావాలని జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇస్తున్న ప్రతి వస్తువు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రైవేట్‌ స్కూల్‌ పిల్లలకు లాగా మా పిల్లలను బడికి పంపుతున్నాం. పిల్లలు బాగా చదవాలంటే వారికి బలం ఉండాలి, అంటే పౌష్టికాహారం ఇవ్వాలని మీరు జగనన్న గోరుముద్ద పథకం ప్రవేశపెట్టారు. మేం కూడా అలాంటి భోజనం ఇవ్వలేం, మేం కూడా ఆలోచించని విధంగా మీరు మా భారాన్ని మీ భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. మీరు ప్రవేశపెట్టిన ప్రతీ పథకం మా తలుపుతట్టి ఇంటికే ఇస్తున్నారు. ఇలా ఆలోచించే సీఎంగా మొట్టమొదటిసారి మిమ్మల్నే చూస్తున్నాం, ఇలాంటి సీఎం ఎల్లకాలం మాకు ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

 

Back to Top