పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, సంస్కరణలు తెచ్చారు

ప్రైవేట్‌ బడులకంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారు

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా విధానాలను రూపొందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ సొంతం

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిది అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విద్యా రంగంలో సమూలమైన మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కు దక్కుతుందని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేసి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారని, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా విధానం రూపొందించారని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విద్యారంగంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలను మంత్రి ధర్మాన ప్రజలకు వివరించారు.

శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. పిల్లలను చదివించి, సమాజంలో  ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చారని చెప్పారు. చదువుకున్న పిల్లాడు ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం తలరాత మారిపోతుందని, పేదరికం నిర్మూలన జరుగుతుందని సీఎం బలంగా నమ్మారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లన్నీ ఎప్పుడూ లేని విధంగా బాగయ్యాయని, మంచి ఫర్నిచర్‌పెట్టి, మంచి టీచర్లను పెట్టి, పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, సాక్స్, బెల్ట్‌ ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి, ఆ పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుంటూ చదివిస్తున్నారని చెప్పారు. ఒక్కరోజు పిల్లాడు స్కూల్‌కు రాకపోతే రెండో రోజు వలంటీర్‌ ఇంటికి వెళ్లి ఎందుకు రాలేదని అడిగే బాధ్యత పెట్టారన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టి, చేతికి ట్యాబ్‌లు ఇచ్చి, డిజిటల్‌ బోర్డులు పెట్టి ప్రైవేట్‌ బడులకంటే దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఘనత వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. పాఠశాల విద్య మాత్రమే కాకుండా.. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి పెద్ద పెద్ద చదువులను ఉచితంగా చెప్పిస్తున్నారని, పేద కుటుంబాల తలరాతలు మార్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top