శ్రీకాకుళం: పౌరుల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలను తీసుకుని వచ్చాం అని, మీ ఇంటి వాకిటే అభివృద్ధి అన్నది కనిపిస్తూ ఉందని, ఇవాళ గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలలో అనూహ్య మార్పులు తీసుకుని వచ్చి వాటిని క్షేత్ర స్థాయిలో చేర్చేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని,పాలన సంబంధం అయిన సంస్కరణలన్నవి ఇప్పుడిప్పు డే సత్ ఫలితాలు ఇస్తున్నాయని..వీటిని మీరు అర్థం చేసుకుని, రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో కసిమివలస,గేదెలవానిపేట గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకత్వంతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు మీరు ఇచ్చిన అధికారం కారణంగానే మేం ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టగలిగాం. మళ్లీ ఈ సారి వైయస్ఆర్ సీపీ తరఫునే శాసన సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వండి అని కోరారు. కసిమివలస గ్రామంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. గ్రామంలో ఉండే రహదారులన్నీ ఆనాడు రోడ్లు,భవనాల శాఖ మంత్రిగాఉన్నపుడే వేయించాను. ఇవాళ గ్రామాల్లో ఉన్నవాళ్లందరూ సొంత ఇళ్లు కలిగి అన్నారు అంటే అందుకు కారణం ఆనాడు వైఎస్ఆర్. నేడు జగన్ అని ఘంటాపథంగా చెప్పగలను. కుటుంబాలు అన్నీ ఆనందంగా ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే. అంతకు ముందున్న టీడీపి ప్రభుత్వానికీ,వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికీ ఉన్న తేడా గమనించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. ఒక్క మాట అయిన నిలబెట్టుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందా ? అని ప్రశ్నిస్తున్నాను. మహిళా సంఘాలనూ,రైతులనూ మోసం చేశారు చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని చెప్పి నిలువునా ముంచారు చంద్రబాబు. నాడు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు చంద్రబాబు. రాజధాని పేరుతో దోపిడీకి తెర లేపి,స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారాయన. ఇందుకు భిన్నంగా నడిచిన ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం. వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వాన నడిచిన ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న ప్రభుత్వం. పేదవారి కన్నీరు తుడిచేందుకే వచ్చిందీ ప్రభుత్వం. వలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మీ గుమ్మాల వద్దకే తీసుకు వచ్చాం. అలానే పాలనను మరింత స్థానికం చేశాం. ఆరోజు చంద్రబాబు తన బినామీ సంస్థతో వేయించిన పిటిషన్ల వల్లే పెన్షన్లు ఆగాయి. 40 మంది నిస్సహాయుల చావుకు కారణం అయ్యారు. ప్రభుత్వమే పేదల ఉన్నతికి కారణం అవుతుంది. అందుకు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం.. ఓ తార్కాణం. సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ అయినా చంద్రబాబు అయినా పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. రేపటి వేళ వీళ్లెవ్వరూ ప్రజలకు దొరకరు. మీరు ఇవన్నీ గమనించాలి. గుర్తించాలి. ఈ నెల 24న నామినేషన్ వెయ్యనున్నాను. వైయస్ఆర్ సీపీ వర్థిల్లాలి..అని మంత్రి ధర్మాన నినాదించారు. స్థానిక నాయకులు సాధు కామేశ్వరరావు, సాధు మురళీ, పసగాడ అప్పలరాజు, గుజ్జల కృష్ణ, అల్లాడ ఏర్రయ్య, గొండు బారికుడు, ఇతర వైయస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.