అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటెండెన్స్‌ ఆధారంగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వాహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. 

 మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే...

  అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుంది.  

- ఎవరైతే స్కూల్‌కు సక్రమంగా వస్తూ,  75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నాం. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రిగారు, అప్పటి విద్యాశాఖ మంత్రి కూడా అనేకమార్లు స్పష్టం చేశారు, ఇదేమీ కొత్త విషయం కాదు.  ఇప్పుడు విద్యా శాఖ మంత్రిగా నేను కూడా అదే చెబుతున్నాను. స్కూల్‌కు వెళ్లకుండా అమ్మ ఒడి పథకాన్ని ఇవ్వాలంటే ఎలా ఇస్తాం. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్‌ ఉండకుండా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేలా ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని అమవు చేస్తున్నాం. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినప్పుడే అమలుపై మార్గదర్శకాలను స్పష్టంగా చెప్పడం జరిగింది.

పిల్లలను బడికి పంపించండి.. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండి
        మీ పిల్లలను బడికి పంపించండి. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోండి అని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నాం. స్కూళ్ళకు పంపడం ద్వారా మీ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పండి. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి. పిల్లలను చదివించేందుకు, వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్, ప్రయివేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. విద్యా బోధనతో పాటు, బైజూస్ ద్వారా, వారిలో నైపుణ్యాన్ని పెంచుతున్నాం. 

 ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు
         ఈఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గలేదు. 2019 సంవత్సరంలో కంటే ఇప్పుడు ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గితే, ఇప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తూ అదే స్టేటస్‌ను ఇస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత ఉంటే తీరుస్తాం. పాఠశాలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలలల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, వాచ్ మెన్ ఇతర సౌకర్యాల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసమే రెండు వేల రూపాయిలు తీసుకోవడం జరుగుతుంది

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top